Pawan Kalyan Son: సింగపూర్ లోని నేడు ఒక స్కూల్ లో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అదృష్టం కొద్దీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు కానీ, ఈ ప్రమాదంలో దాదాపుగా 15 విద్యార్థులు, నలుగురు పెద్దలు గాయపడ్డారు. ఆ గాయపడిన విద్యార్థుల్లో ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan|) కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్(Mark Shankar Pawanovich) కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కాళ్లకు స్వల్ప గాయాలు అవ్వడంతో చికిత్స చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ స్కూల్ సింగపూర్ లోని రివర్ వ్యాలీ రోడ్డు వద్దన ఉండే షాప్ హౌస్ లోని రెండు, మూడు ఫ్లోర్స్ లో ఈ టమోటో కుకింగ్ స్కూల్ కొలువై ఉంది. ఈరోజు ఉదయం 9 గంటల 45 నీంసిహాల ప్రాంతం లో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది.
Also Read: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కి జరిగిన ప్రమాదంపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!
ప్రమాదం జరిగిందనే సమాచారం తెలుసుకున్న వెంటనే సింగపూర్ సివిల్ డిఫెన్సె ఫోర్స్ సహాయసహకారాలు అందించి పిల్లలను సురక్షితంగా కాపాడారు. చెలరేగిన మంటలను ఆరపడానికి దాదాపుగా మూడు వాటర్ జెట్ లను ఉపయోగించి 30 నిమిషాల్లో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంగణంలో దాదాపుగా 80 మందిని ఖాళీ చేయించారు. అందుకు సంబంధించిన రెస్క్యూ సిబ్బంది ఆపరేషన్స్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను వెలికి తీసేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ స్కూల్ లో శిక్షణ నేర్చుకోవడానికి వారానికి గాను 43 వేల రూపాయిల ఫీజు ని చెల్లించాలట. అంత డబ్బులు చెల్లించేంత స్పెషల్ ఈ స్కూల్ లో ఏముంది?, అందులో ఏమి నేర్పిస్తారు?, అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
టమోటో కుకింగ్ స్కూల్ ని 2020 వ సంవత్సరంలో న్యూటన్ షో క్యాంపుల యజమానులు సింగపూర్ లో ప్రారంభించారు. ఈ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే నేటి తరం పిల్లలకు జీవితంలో సరికొత్త విభాగాల్లో నైపుణ్యం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసారు. ఈ స్కూల్ లో ఆహార తయారీకి సంబంధించిన వివిధ వంటగది ఉపకరణాలను ఎలా ఉపయోగించాలి?, కట్ చేయడం ఎలా?, బేకింగ్ చేయడం ఎలా?, వేయించడం, వడ్డించడం, ఆహారాన్ని తయారు చేయడం, ఆహారాన్ని నిల్వ చేయడం ఇలా ఎన్నో అంశాల మీద పిల్లలకు శిక్షణ ఇస్తారు. పిల్లలు చిన్న తనంలోనే పిజ్జా, కప్ కేక్స్ వంటివి తయారు చేయగలరు. సమ్మర్ హాలిడేస్ సందర్భంగా క్యాంప్ కోసం పవన్ కళ్యాణ్ కొడుకు కూడా ఈ స్కూల్ లో శిక్షణ కోసం చేరాడు. 2025 మర్చి 3వ తేదీ నుండి ఈ క్యాంప్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. మే 16 కు ఈ క్యాంప్ ముగుస్తుంది.
Also Read: పరీక్ష తప్పిన విద్యార్థులు..తప్పు ఎవరిది.. పవన్ సంచలన నిర్ణ యం