Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన పవన్ రోడ్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు 1,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 1069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాదాపు గిరిజన ప్రాంతాల్లో రవాణా కష్టాలు ఉండకుండా చేయాలన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తెలుస్తోంది. ఈరోజు కూడా మన్యంలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్.
Also Read : పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన చిరంజీవి!
* 30 మంది విద్యార్థులు పరీక్షలకు దూరం..
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూలంగా 30 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలకు( JEE mains exams ) హాజరు కాలేకపోయారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పెందుర్తిలో ట్రాఫిక్ జామ్ కావడం వల్ల ఉదయం 8:30 నిమిషాలకు పరీక్ష కేంద్రాలకు వెళ్లాల్సిన విద్యార్థులు రెండు నిమిషాలు ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి ఇవ్వకూడదనే నిబంధనతో.. ఆ విద్యార్థులంతా పరీక్షలు రాయలేకపోయారు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ ఘటన పై విచారణకు ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
* విమర్శలు రావడంతో..
సోషల్ మీడియా( social media) వేదికగా ఈ ఘటనపై అనేక రకాల విమర్శలు రావడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. విచారణ చేపట్టి సమగ్ర నివేదిక అందజేయాలని సూచించారు. కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ ను నిలిపివేశారు? పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవాల్సిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సర్వీసు రోడ్ లో ఉన్న ట్రాఫిక్ ను ఏమైనా నియంత్రించారా? వంటి అంశాలపై విచారించాలని విశాఖ పోలీసులకు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో విశాఖ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని విషయాలు సేకరించే పనిలో పడ్డారు.
* పవన్ కఠిన నిర్ణయాలు..
వాస్తవానికి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. మంత్రుల కాన్వాయ్( ministers conway ) తో పాటు అధికారిక కార్యక్రమాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని భావించేవారు. ఇదే ఫార్ములాను సైతం చంద్రబాబు అనుసరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో విఐపి పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని ఆదేశాలు పోలీసులు ఉన్నాయి. ప్రజా ప్రతినిధుల వల్ల ట్రాఫిక్ కు అడ్డంకులు కలిగించే చర్యలు చేపట్టకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. అయినా సరే ఈ ఘటన చోటు చేసుకోవడం పై డిప్యూటీ సీఎం కార్యాలయం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.