Homeఎంటర్టైన్మెంట్'పవన్ - క్రిష్' సినిమా పై బిగ్ అప్ డేట్ !

‘పవన్ – క్రిష్’ సినిమా పై బిగ్ అప్ డేట్ !

సెన్స్ బుల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఈ సినిమాకి సంబందించి అప్ డేట్ కోసం పవన్ ఫ్యాన్స్ ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే కరోనా కారణంగా ‘పవన్ – క్రిష్’ సినిమాలో ఒక పెద్ద మార్పు చేయబోతున్నారు. మొదట ఈ సినిమా క్లైమాక్స్ ను మొరాకోలో భారీ సెట్లలో భారీ స్థాయిలో షూట్ చేయాలని క్రిష్ భారీగా ప్లాన్ చేసుకునప్పటికీ.. […]


సెన్స్ బుల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఈ సినిమాకి సంబందించి అప్ డేట్ కోసం పవన్ ఫ్యాన్స్ ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే కరోనా కారణంగా ‘పవన్ – క్రిష్’ సినిమాలో ఒక పెద్ద మార్పు చేయబోతున్నారు. మొదట ఈ సినిమా క్లైమాక్స్ ను మొరాకోలో భారీ సెట్లలో భారీ స్థాయిలో షూట్ చేయాలని క్రిష్ భారీగా ప్లాన్ చేసుకునప్పటికీ.. కరోనా దెబ్బకు ఇప్పుడు ఆ ప్లాన్ సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.

బీజేపీ దోస్తీ పవన్ కి బలమా… భారమా?

అందుకే మొరాకో ఎపిసోడ్ ను హైదరాబాద్‌లోనే భారి సెట్స్ వేసి క్లైమాక్స్ ను షూట్ చేయాలని క్రిష్ ఫిక్స్ చేశాడట. ఆగష్టు 20న నుండి షూట్ స్టార్ట్ చేయనున్నారట. కాగా ఇప్పటికే ఈ సినిమా క్లైమాక్స్ సెట్స్ కి సంబంధించి గ్రౌండ్ వర్క్ ను ప్రారంభించారని, హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో సెట్స్ వేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ పిరియాడిక్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా.. అలాగే సినిమాలో యువరాణిగా నటించబోతుందని తెలుస్తోంది.

లాక్ డౌన్ విధించాలంటున్న నెటిజన్లు.. పట్టించుకోని సర్కార్

అంటే ఈ చిత్రంలో జాక్వెలిన్ పేరున్న ఓ రాజుకి సోదరి పాత్రలో నటించబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు ఫ్యాన్స్ లో సినిమా పై ఆసక్తిని బాగా పెంచుతున్నాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ భారి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper