Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే ఏపీ ప్రజలు ఎందుకు అంతగా ఆసక్తి చూపిస్తారు.. ఆయన అంటే ఎందుకు అంతగా ఇష్టాన్ని ప్రదర్శిస్తారు.. ఆయన గురించి ఎందుకు అంత గొప్పగా మాట్లాడుతారు.. అతను ఏపీ ప్రజల కోసం ఎందుకు అంతలా తాపత్రయపడతారు.. భోగాపురం విమానాశ్రయంలో ఆ సన్నివేశం చూసిన తర్వాత చాలామందికి అర్థమైంది.
నరేంద్ర మోడీ తన ఇన్నేళ్ల ప్రజా జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రతి కష్టం నుంచి ఆయన కొంత నేర్చుకున్నారు. తద్వారా బలమైన నాయకుడిగా ఎదిగారు. అందువల్లే గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధానమంత్రి వరకు తన స్థాయిని పెంచుకున్నారు. ఒక నాయకుడికి ఇంతకంటే గొప్పతనం.. గొప్ప అవకాశం మరొకటి ఉండదు. 100 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశానికి నాయకత్వం వహించడం అంటే అంత ఈజీ కాదు.
ముందుగానే చెప్పినట్టు నరేంద్ర మోడీ తన జీవితంలో ఎన్నో ఎత్తులు.. పల్లాలు చూసి ఉంటారు. అవన్నీ చూడకపోతే ఇంత స్థాయి నాయకుడిగా ఆయన ఎలా ఎదగ గలుగుతారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నరేంద్ర మోడీ ఏదో ఒక రూపంలో నిరసనలు.. ఆందోళనలు.. వ్యక్తిగత దూషణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా నీట్ ఆందోళనల సమయంలో కూడా నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని విమర్శించిన వారు చాలామంది ఉన్నారు. చివరికి ఆయన తల్లిని కూడా దూషించారు.
నరేంద్ర మోడీ కష్టకాలంలో ఉన్నప్పుడు.. నీట్ ఆందోళన సమయంలో ఇబ్బంది పడుతున్నప్పుడు.. సొంత భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ స్థాయిలో అండగా ఉన్నారో తెలియదు. ప్రధానమంత్రి కి అనుకూలంగా ఎలా వ్యవహరించారో తెలియదు. కానీ ఆ బాధ్యతను అశేషమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు నిర్వర్తించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
భోగాపురం విమానాశ్రయ ప్రారంభానికి వచ్చిన నరేంద్ర మోడీకి ఏపీ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రత్యేక అతిధులు మొత్తం మాట్లాడారు. వీరందరిలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మొత్తానికి హైలైట్. ఎందుకంటే ఆయన ప్రధానికి అండగా ఉంటామని చెప్పారు. కష్టకాలంలో ఆయన బలమైన నాయకుడు అని కొనియాడారు. ఆయనను తిడుతున్న వారందరికీ.. గట్టిగా చెప్పాల్సిన సమాధానం ఒక్కటేనని.. నరేంద్ర మోడీ ఉన్నంతవరకు ప్రధాన మంత్రి పదవి ఆయన చేతుల్లోనే ఉంటుందని.. ఆయన శక్తివంతమైన నాయకుడని.. ఆయన ఆధ్వర్యంలోనే దేశం మరింత బలోపేతమవుతుందని స్పష్టం చేశారు.
పవన్ మాట్లాడుతున్న అంతసేపు నరేంద్ర మోడీ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. తనకు ఈ స్థాయిలో గౌరవం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ను ఆయన అభినందించారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ఏర్పడటం.. కేంద్రంలో ఉన్న బిజెపికి బలమైన సపోర్ట్ ఇవ్వడం.. అప్పట్లో 2024లో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ ను గాలి వాటం కాదని.. ఆంజనేయుడి స్వామి అంశ అని నరేంద్ర మోడీ కీర్తించడం.. ఇవన్నీ ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి.. భోగాపురంలో పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి ఇచ్చిన సపోర్ట్ అచ్చం బాహుబలి సినిమాను రిపీట్ చేసింది . ఆ సినిమా రెండో భాగం లో ప్రభాస్ మాహిష్మతి రాజ్యం కోసం గట్టిగా నిలబడిన తీరు రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. ఇప్పుడు పవన్ చేసిన పని నరేంద్ర మోడీ విషయంలో అలానే ఉంది.
ఎర్రబస్సు రాని ఊరుకు ఎయిర్ పోర్ట్ ఎందుకు అన్నవారికి సమాధానం ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం – గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
గతంలో @ysjagan ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేలా, ఎర్రబస్సు రాని ఊరుకు ఎయిర్ పోర్ట్ అవసరం లేదు, రద్దు చేయాలని కోర్టుకు… pic.twitter.com/f3vQnqBCg5
— JanaSena Party (@JanaSenaParty) August 1, 2026