Homeఎంటర్టైన్మెంట్పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు చేయడం పక్కా

పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు చేయడం పక్కా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాల లోనూ కనిపించాలను కొంటున్నాడు .ఆ క్రమంలో ఇపుడు రెండు సినిమాలకు షూటింగ్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ త్వరలో మరో రెండు చిత్రాలకు సైన్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మించే ‘వకీల్ సాబ్’ చిత్రం తో పాటు , గౌతమీపుత్ర శాతకర్ణి ఫేమ్ క్రిష్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తోన్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రాల షూటింగ్ ను పూర్తి […]


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాల లోనూ కనిపించాలను కొంటున్నాడు .ఆ క్రమంలో ఇపుడు రెండు సినిమాలకు షూటింగ్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ త్వరలో మరో రెండు చిత్రాలకు సైన్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మించే ‘వకీల్ సాబ్’ చిత్రం తో పాటు , గౌతమీపుత్ర శాతకర్ణి ఫేమ్ క్రిష్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తోన్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రాల షూటింగ్ ను పూర్తి చేసిన తరవాత హరీష్ శంకర్ సినిమాను స్టార్ట్ చేస్తాడట. ఆ తరువాత `గోపాల గోపాల ఫేమ్ డైరెక్టర్ డాలీతో ఓ సినిమా చేయబోతున్నాడు .వెరసి పవన్ కళ్యాణ్ మొత్తం నాలుగు సినిమాలతో ప్రేక్షకుల్ని రంజింప చేయనున్నాడు .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దర్శకుడు జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం మొగలాయిల కాలం నాటి కథ అని తెలుస్తోంది . కాగా ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగ పాత్ర పోషిస్తున్నాడని ,సినిమా కధంతా కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది . తాజాగా ఓ తమిళ స్టార్ హీరో ఇందులో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిసింది .టి వి రంగం నుంచి కోలీవుడ్ లోకి అడుగు పెట్టి పెద్ద స్టార్ గా మారిన శివ కార్తికేయన్ పవన్ కళ్యాణ్ చిత్రం లో కీలక పాత్ర పోషించ నున్నట్టు తెలుస్తోంది. శివ కార్తికేయన్ ‘రెమో’ ‘,సీమ రాజా ‘ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు. కాగా అతడి టాలెంట్ కి తగ్గ పాత్రనే క్రిష్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది .

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper