
ఇదర్ కా మాల్ ఉదర్ , ఉదర్ కా మాల్ ఇదర్ అన్నట్టు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు ఒక భాష నుంచి మరో భాషకి వలస వెళ్తుంటాయి . ఆ ప్రక్రియ నే రీమేక్ అని ఇంగ్లీష్ లో , పునర్ నిర్మాణం అని తెలుగులో అంటారు. ఇప్పటివరకు ఎన్నో వేల చిత్రాలు అలా పరభాషల్లోకి వలస వెళ్లాయి. ప్రస్తుతం బాలీవుడ్ నిర్మాత ,దర్శకులు సౌత్ సినిమాల వైపు ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారు . తెలుగులో ఏ సినిమా హిట్టయినా సరే హిందీ లోకి పట్టుకెళ్లిపోతున్నారు. గత ఏడాది `అర్జున్ రెడ్డి` సినిమా ని కబీర్ సింగ్ పేరుతొ , `టెంపర్’ సినిమాని ` సింబా` పేరుతొ రీమేక్ చేసి భారీ విజయం సాధించడం జరిగింది. దాంతో తెలుగులో హిట్టయ్యే ప్రతి సినిమానూ బాలీవుడ్ వాళ్లు కొనుక్కెళుతున్నారు .
ఆ క్రమంలో ఇపుడు నాని హీరోగా నటించిన ` జెర్సీ` సినిమా అదే పేరుతో హిందీలో రీమేక్ కాబోతుంది . అదే విధంగా గత ఏడాది తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన `ఇస్మార్ట్ శంకర్ ‘ చిత్రం హిందీలో రీమేక్ కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం లో `చాక్లెట్ బాయ్` రణబీర్ కపూర్ హీరోగా నటించనున్నాడు కెరీర్లో ఇప్పటిదాకా ఒక్క మాస్ సినిమా కూడా చేయని రణబీర్ కపూర్ ఈ సినిమా కథ నచ్చి హీరోగా చేయడానికి ముందుకొచ్చాడట …
ఆ సినిమా పరిస్థితి అలా ఉంటే మరోవైపు ఈ ఏడాదిలో సంచలన సక్సెస్ సాధించిన ” అల వైకుంఠపురములో” , ” హిట్ ” వంటి చిత్రాల్ని కూడా హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .