Amala mother : అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఒకప్పడు స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో ఈమె పేరు ఉండేది. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగినటువంటి నటనలో అమల ఒకరిగా రాణించారు. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ చిత్రాలలో కూడా నటించింది ఈమె. దీంతో పాటే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తన అద్భుతమైన నటన కనబరించినందుకు ఏకంగా అవార్డులను కూడా సంపాదించింది. అమల రెండు ఫిలింఫేర్ సౌత్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఇక అమల తెలుగులో నిర్ణయం, శివ వంటి సినిమాలలో నాగార్జునతో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్లింది.
కొన్ని రోజుల తర్వాత వివాహ బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. దీంతో ప్రేక్షకులు ఫుల్ ఖుషీ కూడా అయ్యారు. అయితే వివాహ అనంతరం అమల హైదరాబాదుకు మకాం మార్చేశారు. అంతేకాదు వివాహం తర్వాత అమల సినిమాలకు కూడా పూర్తిగా దూరమయ్యారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలలో మాత్రమే నటిస్తున్నారు. చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులకే అక్కినేని అఖిల్ కు జన్మనిచ్చారు ఈ దంతపులు. కాగా అఖిల్ అఖిల్ చిన్న వయసులోనే సిసింద్రీ సినిమాతో చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇలా అఖిల్ కూడా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. అతి చిన్న వయసులోనే అతనికి అదృష్టం వరించినప్పటికీ ఈ మధ్యకాలంలో దురదృష్టం అతన్ని వెంటాడుతూనే ఉందనడంలో సందేహం లేదు.
హిట్ లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా చాలా మందికి ఫ్యాన్ బేస్ ఉంటుంది. అదే విధంగా ఇప్పటికీ కూడా అఖిల్ కు అభిమానులు విపరీతంగా ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అఖిల్ అంటే తెగ ఇష్టపడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఏ సినిమాల్లో నటించిన అతనికి సరైన హిట్ పడటం లేదు. గతంలో ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సరే అఖిల్ లైఫ్ ఇలా సాగిపోతుంది కానీ ఇంతకీ అమల ఏ దేశానికి చెందింది అని అనుకుంటున్నారా?అయితే అమల తల్లిదండ్రుల విషయానికి వస్తే… తండ్రి బెంగాలీ నేవీ ఆఫీసర్ ముఖర్జీ, అమల తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ. అమలా తల్లిదండ్రులు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమలా తల్లి హాస్పిటల్ లో మేనేజ్మెంట్ జాబ్ చేసేవారట. పెళ్లి తర్వాత అమల తల్లిదండ్రులు వైజాగ్, చెన్నై వంటి ప్రదేశాలలో నివసించేవారు.
మధ్యలో అమల సినిమాల్లోకి రావడం, నాగార్జున పరిచయం అవడం, వీరికి పెళ్లి అవడం, ఆ తర్వాత అఖిల్ పుట్టడం అన్ని కూడా చకచకా జరిగిపోయాయి. మొత్తం మీద ఇప్పటికీ కూడా ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి తర్వాత చాలా మంది సినిమాల్లోకి వచ్చిన నచ్చిన ప్రతి పాత్రను చేశారు. కానీ అమల ఫ్యామిలీ కోసం తనకు నచ్చిన ఫీల్డ్ ను వదులుకుంది. కేవలం సెలెక్టెడ్ గా మాత్రమే చేస్తుంటుందని కొనియాడుతారు అక్కినేని అభిమానులు.
ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సమంత , నాగచైతన్య విడాకులపై తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన హాట్ కామెంట్స్ తో అక్కినేని కుటుంబం మరోసారి సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. నాగచైతన్య – సమంత విడాకులు తీసుకుని ఎవరి జీవితంలో వారు ఎంతో హ్యాపీగా ఉంటున్నారు. కానీ వీరిద్దరి గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. రీసెంట్ గా చైతన్య శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్దం అయ్యారు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Nagarjunas wife amalas mother was a woman from ireland
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com