Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ షో లో వచ్చినన్ని ట్విస్టులు ఏ సీజన్ లో కూడా రాలేదు అని చెప్పొచ్చు. ప్రతీ ఎపిసోడ్ ఒక థ్రిల్లర్ సినిమాని తలపించేలా ఉంది. సాధారణంగా ఇలాంటి ట్విస్టులు ఆరు వారాల తర్వాత కానీ , లేదా సీజన్ చివర్లో కానీ ఉంటాయి. కానీ ఈ సీజన్ లో మొదటి వారం నుండే ఆడియన్స్ కి బుర్రలు బ్లాస్ట్ అయ్యే ట్విస్టులు ఇస్తున్నారు. నిన్నటి కెప్టెన్సీ టాస్క్ లో వర్షిణి ఇచ్చిన ట్విస్టు నుండే ఆడియన్స్ ఇంకా కోలుకోలేదు, ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్ ఎలిమినేషన్ విషయం లో నాగార్జున ఇవ్వబోతున్న ట్విస్ట్ నుండి ఆడియన్స్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఇంటి సభ్యుల్లో అందరికంటే తక్కువ ఓటింగ్ ని సంపాదించుకున్న కంటెస్టెంట్ శ్రేష్టి.
బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కి కూడా ఆమె పేరు వచ్చేసింది , లెక్క ప్రకారం ఆమెనే ఎలిమినేట్ చెయ్యాలి. ఓటింగ్ లో శ్రేష్టి చివరి స్థానంలో ఉండగా, చరణ్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. చివరి రెండు స్థానాల్లో ఉన్న వీళ్ళిద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చెయ్యాలి అనే బాధ్యత , రెడ్ టీం కి అప్పగించే అవకాశాలు ఉన్నాయట. ఎందుకంటే ఈ వారం ‘టోటల్ డామినేషన్’ థీమ్ మీద జరుగుతుండడంతో , రెడ్ టీం కి సంబంధించిన రోహిత్ కి ఎలిమినేషన్ చేసే పవర్ ని ఇస్తారట. చివరి రెండు స్థానాల్లో ఉన్న చరణ్ , శ్రేష్టి లలో ఎవరినో ఒకరిని రోహిత్ ఎలిమినేట్ చెయ్యాలి.
‘అగ్నిపరీక్ష 2’ సమయం నుండి హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా రోహిత్ కి ఇద్దరూ ఆయనకు ప్రాణ స్నేహితులు లాగా ఉంటూ వచ్చారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేస్తాడో చూడాలి. ఎవరిని ఎలిమినేట్ చేసిన రోహిత్ కి నెగెటివ్ అవుతుంది. ఈ ప్రక్రియ కూడా రోహిత్ కి నరకప్రాయం గానే ఉంటుంది. హౌస్ లో ఏ విధంగా చూసుకున్న చరణ్ కంటే శ్రేష్టి స్ట్రాంగ్ ప్లేయర్. చరణ్ కి రెండవ అవకాశం వచ్చినా సరిగా ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి గేమ్ పరంగా ఆలోచిస్తే చరణ్ ని ఎలిమినేట్ చెయ్యాలి. ఎమోషన్స్ కి విలువ ఇస్తే శ్రేష్టి ని ఎలిమినేట్ చెయ్యాలి. మరి రోహిత్ ఈ కష్టమైన టాస్క్ ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి.