Bigg Boss Telugu 10 : టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటిని సంపాదించుకున్న రియాల్టీ షోలు చాలానే ఉన్నాయి. అందులో బిగ్ బాస్ షో మొదటి స్థానంలో ఉంటుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 10 వ సీజన్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక గత కొద్దిసేపటి క్రితమే బిగ్ బాస్ 10 నుంచి ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ ఈసారి బిగ్ బాస్ చాలా రసవత్తరంగా ఉండబోతున్నట్టుగా తెలియజేశాడు. అలాగే సెప్టెంబర్ 6 వ తేదీ నుంచి బిగ్ బాస్ షో స్టార్ట్ అవ్వబోతుందనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్స్ గా పాల్గొనడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలైతే చేస్తున్నారు. అయితే ఇందులో చాలామంది సెలబ్రిటీలను భాగం చేయాలని చూస్తున్నప్పటికి కొంతమంది సామాన్యులను కూడా అగ్నిపరీక్ష అనే షో ద్వారా సెలెక్ట్ చేసి ఇందులో భాగం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గత సంవత్సరం పవన్ కళ్యాణ్ పడాల అనే అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ విన్నర్ గా నిలువడంతో అగ్నిపరీక్షలో పాల్గొనడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసి అక్కడ విపరీతమైన టాస్కులను ఎదుర్కొని బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్ట్ వచ్చింది.
పల్లవి గౌడ, తేజస్విని, కావ్య శ్రీ, ఎక్స్ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ వాళ్ళ భార్య జ్యోతి, కడలి సత్యనారాయణ, యూట్యూబర్ నందు లు బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇక వీళ్లతో పాటుగా అగ్నిపరీక్ష నుంచి నలుగురు కంటెస్టెంట్లను ఇందులో భాగం చేయడానికి సన్నాహాలు చేస్తుండటం విశేషం… ఈ సీజన్ లో ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు లు చాలా జోవియల్ గా పంచులు వేస్తుంటారు.
కాబట్టి ఈ సీజన్ లో వాళ్ళిద్దరూ హైలెట్ అయ్యే అవకాశం కూడా ఉంది…గడిచిన తొమ్మిది సీజన్ల కంటే కూడా పదో సీజన్ భారీ క్రేజ్ ను సంపాదించుకుంటుంది అంటు షో యజమాన్యం నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. బిగ్ బాస్ లవర్స్ కి సెప్టెంబర్ 6 నుంచి 100 రోజులపాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించడానికి బిగ్ బాస్ షో యాజమాన్యం రెడీ అవుతుంది.