Lokesh And Pawan Kalyan: ఏపీలో రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. మూడు పార్టీల కూటమి ఒక వైపు.. మరోవైపు విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ మూడు పార్టీల మధ్య బంధం స్ట్రాంగ్ గా ఉంది. అలా ఉన్నంతవరకు ఆ కూటమిని వైసిపి ఏం చేయలేదు అనేది మెజారిటీ విశ్లేషకుల భావన. అయితే ఐక్యం అనేది ఆ మూడు పార్టీల ఇష్టం. వైసిపి గెలవాలి అనుకున్నవారు కూటమి విచ్ఛిన్నం కావాలని కోరుకుంటారు. మెజారిటీ వైసీపీ శ్రేణులు కోరుకునేది అదే. అందుకే ఆ మూడు పార్టీల మధ్య విఘాతానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, లోకేష్ల మధ్య గట్టి తగాదా రావాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ రోజు రోజుకి వారి మధ్య బంధం పెరుగుతూనే ఉంది కానీ.. తగ్గడం లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ విషయంలో నారా లోకేష్ చేసిన ప్రకటన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతోంది.
* లోకేష్ ప్రత్యేక శుభాకాంక్షలు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈరోజు. తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కూటమి పార్టీల శ్రేణులు పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రముఖులు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే అందరికంటే నారా లోకేష్ శుభాకాంక్షలు ప్రత్యేకంగా నిలిచాయి. సినీ అభిమానుల దృష్టిలో పవర్ స్టార్.. జనసైనికుల దృష్టిలో సేనాని.. నాకు మాత్రం దేవుడు ఇచ్చిన అన్న పవన్ అంటూ సంబోధించారు నారా లోకేష్. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆ పార్టీ మీడియాతో పాటు సోషల్ మీడియా ఏవేవో వ్యాఖ్యానాలు చేస్తున్నాయి.
* ఎప్పుడూ ప్రత్యేకంగానే..
పవన్ కళ్యాణ్ విషయంలో లోకేష్ మాత్రం చాలా ప్రత్యేకంగా చూస్తుంటారు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత. లోకేష్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. కానీ వారిద్దరి మధ్య బంధం బాగానే ఉంటుంది. అది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రుచించదు. అందుకే లోకేష్ పవన్ విషయంలో స్పందించిన ప్రతిసారి వైసీపీకి ఎక్కడలేని కోపం. వారు భాగస్వామ్య పార్టీల అధినేతలు. ఆ పైవారు పరస్పరం గౌరవించుకుంటున్నారు కానీ ఈ విషయంలో ఎందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అతిగా రియాక్ట్ అవుతుందో తెలియడం లేదు. ప్రస్తుతం వైసీపీ అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియాలో.. పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్న లోకేష్ అంటూ శీర్షికలు పెట్టి కథనాలు రాస్తున్నారు. వాళ్లు స్నేహితులు. వారు చేసుకోకపోతే ఎవరు చేస్తారు? అసలు ఈ విషయంలో వైసీపీకి ఎందుకు అంత ఉత్సాహం? అంటే వారు కలిసి ఉంటే తనకు సుఖం ఉండదు. తనకు విజయం దక్కాలంటే వారు కలిసి ఉండకూడదు. కానీ వారి మధ్య బంధం రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.