Dhee Raju : ‘ఢీ’ డ్యాన్స్ రియాలిటీ షో కంటెస్టెంట్ రాజు అరెస్ట్ అయిన ఘటన సోషల్ మీడియా లో ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ అంశం పై మొదట్లో రాజు మీద కాస్త సానుభూతి ఉన్నింది కానీ , సోషల్ మీడియా లో లీకైన కొన్ని ఆడియో సంభాషణలు చూస్తుంటే తప్పు మొత్తం రాజు వైపే ఉందని స్ఫష్టంగా అర్థం అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే శిరీష అనే 35 ఏళ్ళ అమ్మాయితో , రాజు శారీరకంగా సంబంధం పెట్టుకున్నాడు. వీళ్ళ మధ్య రిలేషన్ ఏర్పడింది , పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. వీళ్లిద్దరు రిలేషన్ లో ఉన్నప్పుడు శిరీష రాజు కి 12 లక్షల రూపాయిలు ఇచ్చింది. ఇప్పుడు రాజు పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పడం తో , మనస్తాపానికి గురైన శిరీష ఆ 12 లక్షలు తిరిగి ఇవ్వమని రాజు ని డిమాండ్ చేస్తోంది.
రాజు ఇవ్వకపోవడం తో అతని పై కేసు నమోదు చేయగా , పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ లోకి తీసుకున్నారు. అయితే లీకైన ఫోన్ కాల్ సంభాషణలో ఏముందో ఒకసారి చూద్దాం. నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు శిరీష, కావాలంటే పెళ్లి అయ్యాక నీతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాను, ప్రతీ రెండు రోజులు నిన్ను కచ్చితంగా కలుస్తాను , ఇప్పుడు 12 లక్షలు కట్టేంత స్థాయి నాకు లేదు అంటూ చెప్పుకొచ్చాడు రాజు. అందుకు శిరీష నీ మాట మీద నాకు నమ్మకం లేదు , నిన్ను వేరే అమ్మాయితో ఊహించుకోవడమే నాకు చాలా కష్టం గా ఉంటుంది, ఇప్పుడు నేను నువ్వు చెప్పిన డీల్ కి ఒప్పుకుంటే , అది నేను అబద్దం చెప్పినట్టే లెక్క. ప్రాక్టికల్ గా ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, 15 రోజులు సమయం ఇస్తున్నాను , ఆలోచించుకొని నన్ను పెళ్లి చేసుకో , లేదంటే డబ్బులు కట్టి నా జీవితం నుండి వెళ్ళిపో అని అంటుంది శిరీష.
నువ్వు చెప్పిన సమయానికి అంత డబ్బులు ఇచ్చుకోలేను శిరీష , ఒక నాలుగు లక్షలు అయితే సర్దగలను అని అంటాడు రాజు. 4 లక్షలు ఇస్తే నీకు కష్టం విలువ తెలియదు , నేను పడే బాధ విలువ ఆశలు అర్థం అవ్వదు, కడితే మొత్తం కట్టు , లేదంటే నా దగ్గరకు వచ్చేయ్ , నాలుగేళ్ల నుండి నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులను కూడగట్టి 40 లక్షలు అకౌంట్ లో దాచుకున్నాను , అది మొత్తం నీకే ఇస్తాను అని అంటుంది శిరీష. అలా చాలా ఆసక్తికరంగా సాగిన ఈ ఫోన్ కాల్ సంభాషణ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా కానీ రెండు రోజులకోసారి నిన్ను కలుస్తాను
బయటపడ్డ ఢీ షో డాన్సర్ రాజు ఆడియో కాల్
నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా జీవితాంతం నీతో స్నేహితుడిగానే ఉంటాను
నీ దగ్గర తీసుకున్న డబ్బులు అన్నీ తిరిగి ఇచేస్తానని, తనను… https://t.co/HRpBvM1bMS pic.twitter.com/V89NBDaR7z
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2026