Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ మంచి రసవత్తరంగా సాగుతోంది , అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటోంది, కానీ ఆడియన్స్ ఓటింగ్ కి అసలు విలువ ఇవ్వడం లేదనే భావన విశ్లేషకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆడియన్స్ ఓటింగ్ లో టాప్ 5 స్థానం లో ఉన్న చరణ్ ని అన్యాయంగా కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా మొదటి వారం లోనే ఎలిమినేట్ చేశారు మేకర్స్. కానీ వీకెండ్ లో అతి తక్కువ ఓటింగ్ ని నమోదు చేసుకున్న కృష్ణుడు , సుధీర్ లను మాత్రం సేవ్ చేశారు. ఇక్కడే ప్రేక్షకుల్లో ఈ షో పై తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది. అది కాసేపు పక్కన పెడితే , ఈ వారం మొత్తం బిగ్ బాస్ హౌస్ నడిపేది మీరే అంటూ ‘పవర్ ఆఫ్ పీపుల్’ అనే చాప్టర్ ని తెరిచాడు బిగ్ బాస్.
కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎవరెవరు ఉండాలి ?, మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ కి ఓట్లు వేయండి అంటూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రకటన చేశాడు బిగ్ బాస్. ఇదేదో బాగానే ఉందే అని అనుకోని , ఆడియన్స్ తమకు ఇష్టమైన కంటెస్టెంట్ కి ఓట్లు వేసేందుకు ఎగబడ్డారు. అందరికంటే అత్యధిక ఓటింగ్ ని సంపాదించుకున్న కంటెస్టెంట్ మరెవరో కాదు రోహిత్. కానీ ఈయన్ని కెప్టెన్సీ రేస్ నుండి తప్పించారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎంపికైన కెప్టెన్సీ కంటెండర్స్ వీళ్ళే అంటూ రోహిత్ , ముకేశ్ , త్రిగున్ , షాలిని , ఝాన్సీ , ఆటో రామ్ ప్రసాద్, దేబ్జాని , అమన్ పేర్లను చెప్తాడు బిగ్ బాస్.
ఈ 8 మంది కంటెస్టెంట్స్ కి సెపరేట్ బ్లాక్స్ పెట్టి , వాళ్ళ వద్ద 5 బెలూన్స్ ని పెడుతారు. ఈ టాస్క్ కి వర్షిణి సంచాలక్ గా వ్యవహరిస్తుంది. బజార్ మోగిన ప్రతీసారి ఆమె కొన్ని వర్డ్స్ ని చూపిస్తుంది. వాటిని కరెక్ట్ స్పెల్లింగ్ తో రాసే కంటెస్టెంట్ కి బెలూన్ ని పగలగొట్టే అవకాశం వస్తుంది. హౌస్ లో అత్యధిక శాతం సెలబ్రిటీలు ఉన్నారు కాబట్టి , వాళ్ళ ఓట్లు సామాన్యులను తీయడానికే ఉంటుంది కాబట్టి, రోహిత్, అమన్, లను ఈ గేమ్ నుండి తప్పిస్తారు. ఇక సెలబ్రిటీలలో త్రిగున్ , ఆటో రామ్ ప్రసాద్ లను తప్పిస్తారు. మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ కి కెప్టెన్సీ టాస్క్ నిర్వహించబోతున్నారు. ఈ నలుగురిలో ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారో చూడాలి. ఆడియన్స్ ఓట్ల ద్వారా కెప్టెన్సీ కంటెండర్స్ ని ఎంచుకుంటాము అన్నప్పుడు హౌస్ లో మళ్లీ కంటెస్టెంట్స్ ఓటింగ్ సిస్టం పెట్టడం ఎందుకు?, అందరికంటే ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న రోహిత్ కి మరోసారి అన్యాయం జరిగింది కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.