Naga Chaitanya: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. యంగ్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ల నుంచి వస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రానటువంటి గుర్తింపు వాళ్ళు చేస్తున్న సినిమాలతో తెచ్చుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్న హీరోలు సైతం భారీ విజయాల వైపు దూసుకు వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సైతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన రొటీన్ సినిమాలకు స్వస్థ చెప్పి డిఫరెంట్ సినిమాలతోనే సక్సెస్ లను అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే నాగచైతన్య చాలా హ్యాండ్సమ్ గా క్యూట్ గా ఉంటాడనే విషయం మనందరికి తెలిసిందే. అయితే ఆయన అందానికి గల సీక్రెట్ ఏంటి అంటే ఆయన షుగర్ ఐటమ్స్ ని మొత్తానికే అవాయిడ్ చేస్తుంటారట.
షుగరు ఉండే ఫుడ్స్ తీసుకోడట. ఎప్పుడైనా షుగర్ ఐటమ్స్ తినాలి అనిపిస్తే వీక్లీ వన్ డే పెట్టుకొని ఆ ఒక్కరోజు షుగర్ కి సంబంధించిన కంటెంట్ ఏదైనా ఉంటే తింటారట. మిగతా వారం రోజులు మొత్తం ఆ ప్రొడక్ట్స్ ని తినకుండా ఉంటాడట. ఇక ఏది ఏమైనా కూడా తను హీరోగా రాణిస్తున్నాడు. కాబట్టి తన అందాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తన మీదే ఉంది.
ఇక వాళ్ల నాన్న నాగార్జున 70 సంవత్సరాలకి దగ్గరలో ఉన్నప్పటికి ఇంకా యంగ్ హీరోగానే కనిపిస్తుంటాడు. కాబట్టి తన బాటలోనే నాగచైతన్య నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్న ‘వృషకర్మ’ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది.
ఒకవేళ ఈ దసర మిస్ అయితే కనక మరో డేట్ ని కూడా ఫిక్స్ చేయడానికి దర్శకుడు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులందరిని విశేషంగా అలరించింది. ముఖ్యంగా ఇదొక డిఫరెంట్ సబ్జెక్టుగా మారబోతుందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది…