Mrunal Thakur : ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో అందాల ఆరబోతతో పాటు , అద్భుతమైన నటన కనబర్చగల హీరోయిన్స్ లో ఒకరు మృణాల్ ఠాకూర్. ఈమె మన తెలుగు ఆడియన్స్ కి ‘సీతా రామం’ అనే చిత్రం ద్వారా పరిచయమైంది. తొలిసినిమాతోనే తన అందంతో , నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈమె, ఆ తర్వాత తెలుగు , హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి , యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. అయితే ఈమధ్య కాలం లో ఈమెపై సోషల్ మీడియా లో రూమర్స్ ఎక్కువ అయిపోయాయి. నిన్న మొన్నటి వరకు , ఈమె ప్రముఖ యంగ్ హీరో ధనుష్ తో ప్రేమాయణం నడుపుతోంది , త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని మృణాల్ ఠాకూర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
కానీ వీళ్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. వాటిని చూసిన తర్వాత వీళ్ళ మధ్య ఏమి లేదంటే నమ్మడం కాస్త కష్టమే. అయితే రీసెంట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే , ఈమె ధనుష్ తో బ్రేకప్ చేసుకుందని , ఒక ప్రముఖ స్టార్ క్రికెటర్ తో ప్రేమాయణం మొదలు పెట్టిందనే వార్త ఇప్పుడు బాలీవుడ్ లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఆ క్రికెటర్ మరెవరో కాదు , రిషబ్ పంత్. వీళ్లిద్దరు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒకరిని ఒకరు ఫాలో అవ్వడమే. ముఖ్యంగా రిషబ్ పంత్ అయితే మహిళల్లో కేవలం ఇద్దరినీ ఫాలో అవుతున్నారు. ఒకరు అతని సోదరి కాగా, మరొకరు మృణాల్ ఠాకూర్. దేశంలో ఎంతోమంది హాట్ హీరోయిన్స్ ఉండగా , రిషబ్ శెట్టి ఎందుకు కేవలం మృణాల్ ఠాకూర్ ని మాత్రమే ఫాలో అవుతున్నారు?, ఇది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.
రిషబ్ పంత్ ఇప్పటికే పలువురు బాలీవుడ్ హాట్ హీరోయిన్స్ తో డేటింగ్ చేసారంటూ వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ ని ఆ తర్వాత తేలింది. అంతే కాదు , అప్పట్లో రిషబ్ పంత్ డేటింగ్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చిన హీరోయిన్స్ ఎవరినీ కూడా ఆయన ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవ్వలేదు. ఇలాంటి డాట్స్ ని కనెక్ట్ చేసి , కచ్చితంగా వీళ్ళిద్దరూ మధ్య ఎదో జరుగుతోంది అంటూ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలపై మృణాల్ ఠాకూర్ స్పందిస్తుందో లేదో చూడాలి.
