Movie Making: మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసినప్పటికీ, అవి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచినవి చాలానే ఉన్నాయి. 300 కోట్లు ఖర్చు పెట్టమని అన్నారు , కానీ అక్కడ చూస్తుంటే 100 కోట్లు కూడా ఖర్చు చేసినట్టు లేదు, క్వాలిటీ చాలా నాసిరకంగా ఉంది అని ఆడియన్స్ అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ కేవలం కంటెంట్ ని బలంగా నమ్ముకొని , అతి తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టడం వంటివి ఈ ఏడాది లోనే మనం చాలా చూశాము. ఇదంతా పక్కన పెడితే , బడ్జెట్ లేక, ఫోన్ కెమెరా తో తీసిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి.
అలాంటి సినిమాల్లో ఒకటి ‘యూత్’. కెన్ కరుణాస్ హీరో గా నటిస్తూ , దర్శకత్వం కూడా తానే చేసాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా సెన్సేషనల్ హిట్ గా నిల్చి, బాక్స్ ఆఫీస్ వద్ద 120 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కెన్ కరుణాస్ ఈ చిత్రానికి ముందు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసేవాడు. అయితే ‘యూత్’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఆయన తన ఫోన్ కెమెరా తోనే చిత్రీకరించాడట. వాటిని ఒక డెమో గా ప్రముఖ నిర్మాతలు కరుప్పయ్య రామ్, సులోచన కుమార్ లకు చూపించారట. వాళ్లకు కెన్ కరుణాస్ తెరకెక్కించిన సన్నివేశాలు బాగా నచ్చడం తో , అతను కోరినంత బడ్జెట్ ఈ సినిమా పై పెట్టడానికి ముందుకు వచ్చారట. ఇక ఆ తర్వాత హిస్టరీ మన అందరికీ తెలిసిందే. అలా ఒక ఫోన్ కెమెరా తో తీసిన సన్నివేశాలతో , ఒక పెద్ద ప్రొడ్యూసర్ ని మెప్పించడం అనేది సాధారణమైన విషయం కాదు.
ఈ సినిమా కేవలం తమిళం లో మాత్రమే కాదు, తెలుగు లో కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఇక ఫోన్ కెమెరా తో పూర్తి స్థాయిలో తెరకెక్కిన సినిమా ‘మేము ఫేమస్’. సుమంత్ ప్రభాస్ హీరో గా నటిస్తూ , దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 వ సంవత్సరం లో విడుదలైంది. చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్ ప అనురాగ్ రెడ్డి , శరత్ చంద్ర, చంద్రు మనోహర్ ఈ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మించారు. ఈ సినిమాని సుమంత్ ప్రభాస్ ఫోన్ కెమెరా తో తెరకెక్కించానని అప్పట్లో అనేక ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చాడు. అలా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజే 1 కోటి 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
మొదటి మూడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ లో ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి అట. ప్రేక్షకులకు పరిచయం లేని హీరో , ఫోన్ కెమెరా తో సినిమా తీసినప్పటికీ, ఆడియన్స్ ఆ చిత్రాన్ని థియేటర్స్ లో చూసి ఆదరించారంటే , కంటెంట్ కి ఉన్న పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రతిభ కి ఎలాంటి అడ్డంకులు లేవు. డబ్బు లేకుండా సినిమా తియ్యలేము అని చెప్పడం కేవలం ఒక సాకు మాత్రమే. ఎలా అయినా తమ ప్రతిభ ని బయటపెడుతూ సినిమా చెయ్యాలి అనే కసి , ఉంటే చాలు , బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు నెలకొల్పవచ్చు అని చెప్పడానికి పైన చెప్పిన రెండు చిత్రాలే ఒక బెస్ట్ ఉదాహరణ. పైగా ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని , మన టాలెంట్ ని చూపించుకుని గొప్ప అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రతిభ ఉన్న కుర్రాళ్ళు మధ్యలోనే ఆగిపోకండి, మీ టాలెంట్ ని ఆవిష్కరించండి, మీరు కోరుకున్న ఫలితాలు మీ ముందు ఉంటాయి. ఈ అంశం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.