Bigg Boss 10 Telugu: ఈమధ్య కాలం లో బిగ్ బాస్ సరికొత్త సీజన్స్ ని బాగా గమనిస్తే, టీం కొంతమంది కంటెస్టెంట్స్ పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఉదాహరణకు ఈ సీజన్ లో రోహిత్ ని తీసుకుందాం. బిగ్ బాస్ లో ఎప్పటి నుండో ఉన్న రూల్స్ ని అనుసరిస్తూ, ఎంగిలి కప్పులను కడగను అన్న అంశంపై , రోహిత్ ని దాదాపుగా అరగంట సేపు తిట్టారు. ఎమోషనల్ గా అతన్ని బాగా డౌన్ చేసే ప్రయత్నం చేశారు. రోహిత్ కాబట్టి తట్టుకొని నిలబడ్డాడు కానీ , వేరే ఏ కంటెస్టెంట్ అయినా మొన్న కన్నీళ్లు పెట్టుకునే వారు. మరోపక్క బిగ్ బాస్ రూల్స్ ని అతిక్రమిస్తూ, నోటికి వచ్చినట్టు వ్యక్తిగత దూషణలు చేసిన త్రిగున్ ని మాత్రం పెద్దగా టార్గెట్ చేసుకుందా , పై పైన తిట్టి వదిలేసాడు హోస్ట్ నాగార్జున.
చాలా మంది ఉద్దేశపూర్వకంగానే రోహిత్ ని టార్గెట్ చేసారని, హౌస్ లో ఉన్న సెలబ్రిటీ కంటెస్టెంట్స్ తో పాటు , రోహిత్ కి వ్యతిరేకంగా మరో సెలబ్రిటీ నాగార్జున కూడా తయారు అయ్యాడంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. అయితే అందరూ అనుకుంటున్నట్టు గానే , ఇదంతా రోహిత్ ని టార్గెట్ చేస్తూ , ఉద్దేశపూర్వకంగానే చేసింది బిగ్ బాస్ టీం. ఎందుకంటే రోహిత్ ఇప్పుడు ఓటింగ్ లో తిరుగులేని ఆధిక్యతతో మిగిలిన కంటెస్టెంట్స్ ని డామినేట్ చేస్తున్నాడు. ఇంతటి డామినేషన్ మొదటి వారం లోనే ఒక కంటెస్టెంట్ కి వస్తే విన్నర్ ఎవరో డిసైడ్ అయిపోతుంది. అందుకే కాస్త అతన్ని డౌన్ చేయడానికి , అతని గేమ్ ప్లాన్ మార్చే రేంజ్ లో అతనిలోని ఎమోషనల్ బ్యాలన్స్ ని తగ్గించడం కోసమే కావాలని టార్గెట్ చేశారు. అదే సమయం లో త్రిగున్ మాట్లాడిన మాటలకు అతన్ని గట్టిగా టార్గెట్ చేసి తిడితే , అతను తన గేమ్ ప్లాన్ ని మార్చుకునే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ అదే జరిగితే త్రిగున్ తన ఆట తీరుని మార్చుకుంటాడు , రోహిత్ ని టార్గెట్ చేయడం ఆపేస్తాడు. అలా జరిగితే కంటెంట్ రాదు. కేవలం కంటెంట్ ని రప్పించుకోవడం కోసమే , త్రిగున్ ని గట్టిగా మందలించలేదు. ఇక్కడి వరకు లాజిక్ బాగానే ఉంది, కానీ ఏ ఉద్దేశ్యం తో దేబ్జాని చేసిన తప్పులను కవర్ చేసి , ఆమెని జాకీలు పెట్టి మరీ పైకి లేపే ప్రయత్నం చేశారు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఆమె సామాన్యులను పట్టుకొని చిల్లర బ్యాచ్ అని, నక్కల గుంపు అని కామెంట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి. అయినప్పటికీ కూడా ఆమె ని ప్రశ్నించలేదు, కానీ రోహిత్ ని మాత్రం చిన్న తప్పుని కూడా పైకి ఎత్తి చూపుతూ ఇష్టమొచ్చినట్టు తిట్టొచ్చు , ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కంటెంట్ కోసం త్రిగున్ ని పెద్దగా టార్గెట్ చేయడం లేదు అనేది నిజమైతే, దేబ్జాని ఎలాంటి కంటెంట్ ఇవ్వడం లేదు కదా , ఆమె చేసిన తప్పులను ఎందుకు కప్పి పుచ్చుతున్నారు?, కేవలం ఆమె మాటమే కాదు , వర్షిణి కూడా అనేక సార్లు నోర్లు జారింది. అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ ని దద్దులు అంటూ కామెంట్ చేసింది. దీన్ని కూడా పట్టించుకోకుండా వదిలేసాడు నాగార్జున. ఇదంతా పక్కన పెడితే ఝాన్సీ రోహిత్ టీం లో ఉన్నప్పటికీ కూడా, అతని ప్లానింగ్ మొత్తాన్ని , తన టీం లోని త్రిగున్, ఆటో రామ్ ప్రసాద్ లకు వివరించింది. ఇది నమ్మక ద్రోహం లెక్కనే వస్తుంది కదా ?, ఎందుకు నాగార్జున ఈ అంశంపై ఝాన్సీ ని ప్రశ్నించలేదు. ఆటో రామ్ ప్రసాద్ అమన్ ని హై రిస్క్ జోన్ లో పెట్టినప్పుడు రోహిత్ ‘పర్ఫెక్ట్.. వాడు ఫౌల్ ఆడాడు’ అని అన్న మాటలకు సంబంధించిన వీడియో ని ప్లే చేసి అమన్ కి చూపించారు. అసలు చూపించాల్సిన అవసరం లేదు , అమన్ కి ఈ అంశం పై ఒక క్లారిటీ ఉంది , రోహిత్ కూడా క్లారిటీ ఇచ్చాడు.
కేవలం వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడం కోసం మాత్రమే నాగార్జున ఈ వీడియో ని ప్లే చేసి చూపించాడు, ఇది అసలు అవసరమే లేదు, కానీ రోహిత్ ని ఎమోషనల్ గా మరింత డౌన్ చేయడం కోసం ఇలా చేసాడు అనేది స్పష్టంగా అర్థం అవుతోంది. ఇదంతా పక్కన పెడితే అసలు కృష్ణుడు బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చాడో అతనికే క్లారిటీ లేదు. వారం నుండి బిగ్ బాస్ హౌస్ లో ఉంటున్నాడు , కానీ ఇప్పటి వరకు ఆయనకు రోహిత్ పేరే తెలియదు. ఒకవేళ తెలిసినా తెలియనట్టు బలుపు ప్రదర్శించాడు అనుకోవచ్చు. అంతే కాకుండా , హౌస్ లో గేమ్ ఆడే అవకాశం వచ్చినప్పుడు , చాలా తేలికగా గివ్ అప్ ఇచ్చేసాడు. ఈ అంశాన్ని అసలు పట్టించుకోలేదు నాగార్జున , ఇది దేనికి సంకేతం అనుకోవాలి?.
స్పష్టంగా ఆయన సెలబ్రిటీల తప్పులను వెనకేసుకొని వస్తున్నట్టుగానే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా?, మరి మీకు సెలబ్రిటీలే ఎక్కువ అనుకుంటే , వాళ్లనే తీసుకోవాల్సింది, అగ్ని పరీక్ష షో అని పెట్టి , సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చి , వాళ్ళని ఎమోషనల్ టార్చర్ చేయడం ఎందుకు?, ఇదెక్కడి న్యాయం అని నెటిజెన్స్ నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. హౌస్ లో సెలబ్రిటీలు మొత్తం కలిసి రోహిత్ మీద మూకుమ్మడి దాడి చేస్తున్నారు, ఇలాంటి సమయం లో హార్ట్ బ్రేక్ , హార్ట్ గేమ్ ఒకటి పెట్టారు. సెలబ్రిటీలు మొత్తం రోహిత్ కి హార్ట్ బ్రేక్ పెట్టారు , అత్యధిక ఓట్లు ఆయనకే వచ్చాయి కాబట్టి, నీ గేమ్ వాళ్లకు నచ్చడం లేదు , మార్చుకో అని చెప్పడం ఏంటి?, కంటెస్టెంట్స్ ని మ్యానిప్యులేట్ చేయడం వంటివి త్రిగున్ చేస్తున్నాడు. ఇది సుధీర్ రెడ్డి , ముకేశ్ వంటి వారు పసిగట్టారు కూడా. అతని నిజ స్వరూపాన్ని బయట పెట్టడం కోసం , అతని వీడియోలు ప్లే చేయొచ్చు కదా?, ఎందుకు రోహిత్ నే ఇంతలా టార్గెట్ చేస్తున్నారు?, అతను ఏది చేసిన తప్పే అన్నట్టు చూపిస్తున్నారు ఎందుకు? అనే ప్రశ్న అందరిలోనూ మెలుగుతోంది. కేవలం ఒక్కటే టార్గెట్ , రోహిత్ గ్రాఫ్ ని తగ్గించడమే బిగ్ బాస్ టీం లక్ష్యం. కానీ ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు, రోహిత్ గ్రాఫ్ తగ్గే విషయాన్ని కాసేపు పక్కన పెడితే , ఆయన ఓటు బ్యాంక్ మరో లెవెల్ కి వెళ్ళిపోయింది అని చెప్పొచ్చు. మరి బిగ్ బాస్ టీం రోహిత్ ని టార్గెట్ చేస్తున్న ఈ విధానం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.