Mokshagna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య బాబు(Balayya Babu)కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ వరుస విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో కొంతమంది హీరోలు మాత్రం ఏం చేయాలో తెలియని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారు…ఇక ఏది ఏమైనా కూడా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించిన హీరోలకు మాత్రమే మంచి క్రేజ్ అయితే ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా సినిమాను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు… ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నందమూరి ఫ్యామిలీ నుంచి మరి కొంతమంది హీరోలు వాళ్ల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ (Mokshagna) కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ గత కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అసలు మోక్షజ్ఞకు సినిమాలు చేయాలనే ఇంట్రెస్ట్ ఉందా? లేదంటే స్టార్ హీరో కొడుకు కాబట్టి తను కూడా సినిమాలు చేయాలని అతని మీద వాళ్ల కుటుంబ సభ్యులు వాళ్ళ అభిప్రాయాలను రుద్దుతున్నారా?అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.
Also Read : మోక్షజ్ఞ ను లాంచ్ చేసేది ‘కల్కి’ మూవీ డైరెక్టరేనా..? ప్రశాంత్ వర్మ చేసే సినిమా రెండో మూవీగా రాబోతుందా..?
మరి ఏది ఏమైనా కూడా మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి ఇదే అనువైన సమయం ఇక ఇది కూడా దాటి పోతే మాత్రం ఆయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అది వేస్ట్ అవుతుందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఎందుకంటే ఇప్పటికే మోక్షజ్ఞ కి 30 సంవత్సరాలు వచ్చాయి. ఈ ఏజ్ లో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ మంచి సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగితే స్టార్ హీరోగా ఎదుగుతాడు. లేదంటే మాత్రం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకుండా కామ్ గా తన బిజినెస్ పనులను చూసుకుంటూ ఉంటే బాగుంటుందని ఇంకొంతమంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…