Kalabhavan Mani Real Life Story: వీళ్లు విలన్ పాత్రలలో అద్భుతంగా నటించి తమ నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. కానీ కొన్ని వ్యసనాలు కొందరు నటీనటుల కెరియర్ నీ నాశనం చేశాయి. ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే తోపు నటుడు కూడా ఒకప్పుడు తనకున్న వ్యసనంతో తన కెరియర్ చేతులారా తనే నాశనం చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు తమ సహజ నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరవుతూ ఉంటారు. వాళ్లు చేసింది ఏ పాత్ర అయినా కూడా తమ నటనతో ప్రేక్షకులను మెప్పించి వాళ్లకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో తమ ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు ఇప్పటివరకు చాలామంది ఉన్నారు. అలా మంచి టాలెంట్ ఉన్న కొంతమంది నటీనటులు మధ్యానికి బానిస అయ్యి తమ కెరియర్ పూర్తిగా నాశనం చేసుకున్నారు. ఇటువంటి నటులలో కళాభవన్ అనే నటుడు కూడా ఒకరు. ఒకప్పుడు కళాభవన్ తన నటనతో, పాటలు, కామెడీ టైమింగ్స్ తో ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇతను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. కళాభవన్ కేరళలో త్రిసూల్ లో చాలకుడి అనే గ్రామంలో జన్మించాడు.
ఇతని అసలు పేరు రామన్ మనీ. కళాభవన్ కు చిన్నతనం నుంచి పాటలు పాడటం, నటించడం, మిమిక్రీ చేయడం వంటివి చాలా ఇష్టం. ఇతను చిన్నతనంలోనే కళాభవన్ రంగస్థలం టీంలో చేరాడు. తన నటనతో ఈ టీంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సమయంలోనే అతని పేరు కళాభవన్ మనీగా మారింది. నటన పై తనకు ఎంతో ఇష్టం ఉండడంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మలయాళ సినిమా ఇండస్ట్రీలో తన సినీ కెరియర్ మొదలుపెట్టాడు. తొలి సినిమాలో ఆటో డ్రైవర్ పాత్రలో నటించాడు. ఇక తర్వాత మలయాళం తోపాటు తెలుగు, తమిళ్, కన్నడ ఇలా అన్ని భాషలలో కలిపి 250 కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇతను టాలీవుడ్ లో వెంకటేష్ హీరోగా నటించిన జెమిని సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఇతను కేవలం నటుడు మాత్రమే కాదు ఒక సామాజిక కార్యకర్త కూడా.
Also Read: Katrina Kaif Beauty Secret: కత్రినా కైఫ్ అందానికి రహస్యం ఏంటి? రోజు ఏం చేస్తుంటుంది?
దాదాపు 20 మందికి ఇతను ప్రతిరోజు సాయం అందించేవాడు. కళాభవన్ తన సహాయకుడికి కాలేయ చికిత్స అందించడానికి అప్పట్లో ఏకంగా 10 లక్షల రూపాయలను అందించాడు. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కళాభవన్ మార్చి 3, 2016లో ఇంట్లో ఉన్న తన గదిలోనే అపస్మారక స్థితిలో అందరికీ కనిపించాడు. ఆ తర్వాత అతనికి ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా అప్పటికే కళాభవన్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే అతను రోజు కూడా 12 నుంచి 13 మద్యం సీసాలు తాగేవాడని, అతని ఖాళీ ఎం పూర్తిగా పాడైనప్పటికీ అతను ఈ మధ్యన వ్యసనాన్ని ఆపలేదని అతని సన్నిహితులు తెలిపారు.