Anil Ravipudi Comments: టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) తర్వాత నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ ఎవరంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు అనిల్ రావిపూడి(Anil Ravipudi). పటాస్ సినిమా తో దర్శకుడిగా మొదలైన ఆయన జైత్ర యాత్ర సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వరకు ఘనంగా సాగింది. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే అనిల్ రావిపూడి డైరెక్టర్ అయ్యే ముందు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీను వైట్ల(Srinu Vaitla) దగ్గర పని చేసేవాడు. చాలా సినెమాలవరకు ఆయన స్క్రిప్ట్ ని కూడా అందించాడు. అలా అనిల్ రావిపూడి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన చివరి చిత్రం ‘ఆగడు’. దూకుడు వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీను వైట్ల, మహేష్ బాబు(Superstar Mahesh Babu) కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండేవి.
మహేష్ బాబు కెరీర్ లో భారీ అంచనాలు ఏర్పాటు చేసుకొని అత్యధిక ఓపెనింగ్ వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఇది ఒకటి. అలా మూడు రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో దంచి కొట్టేసిన ఈ చిత్రం, నాల్గవ రోజు నుండి పూర్తిగా పడుకుంది. దీంతో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా ఫలితం పై గతం లో అనిల్ రావిపూడి మాట్లాడిన మాటలను సోషల్ మీడియా లో అభిమానులు మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘ ఆగడు చిత్రానికి సెకండ్ హాఫ్ నేను పటాస్ తరహా లో స్క్రిప్ట్ ని రెడీ చేద్దామని అనుకున్నాను. అంటే కాస్త ఎమోషనల్ పద్దతిలో తీసులెడమని నా ఐడియా. కానీ అప్పటికే ఆ చిత్రాన్ని శ్రీను వైట్ల తన స్టైల్ లో స్క్రిప్ట్ ని రెడీ చేసుకొని , సెకండ్ హాఫ్ ని మొదలు పెట్టేసాడు. దీంతో నేనేమి చెప్పలేకపోయాను. దూకుడు కాంబినేషన్ కావడంతో సెకండ్ హాఫ్ అందరూ దూకుడు లాగానే ఉందని అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. సినిమా ఫ్లాప్ అవ్వడానికి అదే ముఖ్య కారణం’ అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.
ఈ సినిమా అప్పట్లో వచ్చిన హైప్ కి తగ్గట్టు పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచేదని, మేకర్స్ బంగారం లాంటి ఛాన్స్ ని మిస్ అయ్యారని అభిమానులు అంటున్నారు. శ్రీనువైట్ల కూడా తన పాత తరహా స్క్రీన్ ప్లే స్టైల్ తోనే తన తదుపరి చిత్రం ‘బ్రూస్లీ’ తీసాడు. ఇది కూడా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఏ స్క్రీన్ ప్లే ఫార్ములా తో అయితే ఆయన తన కెరీర్ లో సక్సెస్ ని చూశాడో, అదే స్క్రీన్ ప్లే ఫార్మటు తో కెరీర్ ని ముగించుకున్నాడు.