Rajamouli Secret: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా మంచి పేరును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)…ఇక ప్రభాస్ తో చేసిన బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన పాన్ ఇండియా సినిమాలకు తెర లేపాడు. అప్పటినుంచి ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలను చేయడానికి స్టార్ హీరోలందరు ముందుకు వస్తున్నారు. ఇక దర్శకులు సైతం వాళ్ళను వాళ్ళు స్టార్ డైరెక్టర్స్ గా ఎలివేట్ చేసుకుంటూనే పాన్ ఇండియా దర్శకులను ఎంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు… అయితే రాజమౌళి ఇప్పటివరకు చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు సూపర్ సక్సెస్ లని సాధించడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు… ఇక ఇప్పుడు రాజమౌళి నుంచి ఏ సినిమా వచ్చిన కూడా సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇలాంటి సినిమాని చేయడమే కాకుండా దాన్ని సరైన విధంగా ప్రమోషన్స్ చేయడం దానిని జనాల్లోకి తీసుకెళ్లడం అనేది రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి… అయితే రాజమౌళి సక్సెస్ ల వెనకాల సీక్రెట్ ఏంటి అంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలైతే నడుస్తున్నాయి.
నిజానికి రాజమౌళి సక్సెస్ వెనక అసలు కారణం ఏంటంటే ఆయన చాలావరకు హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉంటాడు. ఒక సబ్జెక్ట్ ను తీసుకున్నాడు అంటే దానిని సాధ్యమైనంతవరకు బెస్ట్ ప్రోడక్ట్ గా మార్చే ప్రయత్నం చేస్తాడు. మధ్యలో డివియెట్ అవ్వకుండా ఒక ప్రాజెక్ట్ మీద స్టిక్ ఆన్ అవ్వడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు…
Also Read: హరిహర వీరమల్లు సినిమా బడ్జెట్ ఎంత..? ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తే ప్రొడ్యూసర్ సేఫ్ గా ఉంటాడు..?
ఇక దానికి తగ్గట్టుగానే ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా రిలీజ్ చేసే వరకు ఆయన ప్రతి క్రాఫ్ట్ మీద ఫోకస్ చేస్తూ అన్ని క్రాఫ్ట్ లను తన గ్రిప్ లో ఉంచుకోవడమే కాకుండా తన సజేషన్స్ ఇస్తూ తనకేం కావాలో వాళ్ళకి చెప్పి చేయించుకుంటూ ఉంటాడు. తన అసిస్టెంట్స్ మీద కూడా ఎక్కువ డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్ గా తనే అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ ముందుకు సాగుతూ ఉండడం వల్లే ఆయనకు సక్సెసులైతే దక్కుతున్నాయి…
ఇక సినిమా ఇండస్ట్రీలో ఆయన లాగా అన్ని క్రాఫ్ట్ లను జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తే ప్రతి దర్శకుడికి సక్సెసులు దక్కే ఆకాశమైతే ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… చూడాలి మరి ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు. తద్వారా ప్రపంచ సినిమా ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటాడా లేదా అనేది…