ఎంటర్టైన్మెంట్మార్పుల ప్రవాహంలో మెగాస్టార్ సినిమా !

మార్పుల ప్రవాహంలో మెగాస్టార్ సినిమా !

మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫెర్ రీమేక్’ ప్రస్తుతం మార్పుల ప్రవాహంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో కీలకమైన మార్పులను ఆల్ రెడీ చేసేశారు. మోహన్ రాజాను దర్శకుడిగా ఫిక్స్ అయిన తరువాత, ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి కూడా పూర్తి స్క్రిప్ట్‌ ను వినిపించారు. కానీ, అంతలో కరోనా సెకెండ్ వేవ్ వచ్చి పడింది. కట్ చేస్తే.. దర్శకుడు మోహన్ రాజాకి మళ్ళీ రెండు నెలలు టైం దొరికింది. అందుకే మళ్ళీ స్క్రిప్ట్ మీద కూర్చున్నాడు.

కూర్చుంటే కూర్చున్నాడు. మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీన్స్ ను కూడా మార్చుకుంటూ పోతున్నాడట. మెగాస్టార్ ఇమేజ్ కు అనుగుణంగా మోహన్ రాజా కథలో మార్పులు చేస్తే పర్వాలేదు, కానీ మార్పులు పేరుతో కథనే మార్చుకుంటూ పోతేనే అసలుకే మోసం వస్తోంది. అసలైతే ఏప్రిల్ నుండి లూసిఫెర్ రీమేక్ షూటింగ్ మొదలవ్వాలి కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆలస్యమవుతోంది. ఈ ఆలస్యం మోహన్ రాజా స్క్రిప్ట్ లో మరిన్ని మార్పులు చేయడానికి కారణం అయింది. మోహన్ రాజా మంచి దర్శకుడే. పైగా అతను సక్సెస్ లో ఉన్నాడు.

ఇక తమిళ ఇండస్ట్రీలో మోహన్ రాజాకు మంచి పేరు ఉంది. అందుకే చిరు పిలిచి మరీ అతనికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తన మార్పుల ప్రవాహంలో లూసిఫెర్ ను ఎలా మారుస్తాడో అనే భయం పట్టుకుంది అందరికి. ఇక ‘లూసిఫర్’లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది. అయితే మంజు వార్యర్ పాత్రలోనే సుహాసిని కనిపించబోతుంది. ఈ పాత్రకు సంబంధించిన ట్రాక్ ను కూడా మోహన్ రాజా చాల మార్చారట. అలాగే సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ ను కూడా పూర్తిగా మార్చారట.

అయినా, మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా మోహన్ రాజా షాట్ మేకింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి గానీ, ఇలా హిట్ సినిమా స్క్రిప్ట్ లో ప్రతి పార్ట్ ను మార్చుకుంటూ పోతే, ఇక ఆ హిట్ సినిమా చేయడం ఎందుకు ? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా టాలెంట్ పై నమ్మకముంచి అతనికే ఈ భారీ మూవీని రీమేక్ చేసే అవకాశం ఇస్తే.. అతను ఆ అవకాశాన్ని చెడగొట్టుకుంటున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇలా అయితే సినిమా అవుట్ ఫుట్ పై నమ్మకాలు వదిలేసుకోవాలేమో.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Johnny Master: జానీ మాస్టర్ ని రక్షించిన చిరంజీవి, బాలకృష్ణ.. వీడియో వైరల్..

Johnny Master: గత కొద్దిరోజుల నుండి డ్యాన్సర్స్ అసోసియేషన్ లో జరుగుతున్న గొడవలను మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియా లెవెల్ లో టాప్ 2 కొరియోగ్రాఫర్స్ గా పేరొందిన జానీ...

Srikanth Odela: శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీ చిరంజీవి తో చేయడం లేదా…ఆ స్టార్ హీరోని లైన్ లో పెట్టాడా…

Srikanth Odela: దసరా సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానిని హీరోగా పెట్టి ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీద...

Most Popular

Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
OG TV Telecast

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...
Hyper Aadi

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...
The Paradise

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...