కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత దేశం అత్యంత ఘోరమైన పరిస్థిని ఎదుర్కొంటోందని అమెరికా అధ్యక్షునికి అత్యున్నత స్థాయి వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోని ఫాసీ అన్నారు. ప్రస్తుతం భారత దేశం చాలా ఘోరమైన స్థితిని ఎదుర్కొంటోందని చెప్పారు. మరే దేశంలోనూ నమోదు కానంతటి అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు భారత్ లో నమోదయ్యాయన్నారు. భారత్ లోని కరోనా వైరస్ రూపాల లక్షణాలు ఇంకా ఇంకా స్పష్టంగా తెలియడం లేదన్నారు.