Miss Shetty Mr Polishetty Collections: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క , యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అటు యూత్ ఆడియన్స్ ను ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసింది.
ఈ సినిమా లో కొంచెం ఇబ్బంది పడే కంటెంట్ ఉన్న కానీ ఎక్కడ కూడా వల్గారిటీ అనేది లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. దీనితో ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు దొరుకుతుంది ఈ సినిమాకు. ఇక ఈ చిత్రం మొదటి రోజు ఇండియా వైడ్ దాదాపుగా 2. 6 కోట్లు నెట్ వసూళ్లు చేసింది. ఇక రెండో రోజు మరో 2 కోట్లు నెట్ వసూళ్లు చేసి , రెండు రోజులకు కలిపి 4. 6 కోట్లు నెట్ సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే మంచి వసూళ్లు అనే చెప్పాలి.
ఇక శనివారం , ఆదివారం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. నిజానికి తెలుగులో ఈ సినిమాకు జవాన్ సినిమా గట్టి పోటీ ఇస్తుంది. షారుఖ్ ఖాన్ నటించిన ఆ సినిమా పూర్తిగా సౌత్ ఫ్లేవర్ తో నిండిపోవడంతో తెలుగులో ఆ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఒక దశలో జవాన్ ముందు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి నిలబడుతుందా అనే అనుమానాలు వచ్చాయి, కానీ సాయంత్రం టైం కి ఈ సినిమాకు బుకింగ్స్ ఊపందుకున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో శుక్రవారం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు 139 షోలు పడితే అందులో 90 షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. దీనిని బట్టి చూస్తే ఈ వీకెండ్ 2 డేస్ ఈ సినిమా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. నవీన్ పొలిశెట్టి మార్క్ కామెడీ, స్వీటీ మార్క్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనే చెప్పాలి. నిజానికి తెలుగులో ఈ సినిమాకు సోలో రిలీజ్ డేట్ దొరికిందనే చెప్పాలి. కాకపోతే షారుఖ్ సినిమా ఎఫెక్ట్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మీద గట్టిగా పడిందని చెప్పాలి
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More