Anushka Shetty: సూపర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటి అనుష్క… యోగా టీచర్ గా తన కెరీర్ ని ముందుకు తీసుకెళుతున్న ఆమె ను పూరి జగన్నాథ్, నాగార్జున కలిసి సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అప్పటినుంచి ఆమె వెను తిరిగి చూడకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుంది. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు తనకు భారీ గుర్తింపును తీసుకొచ్చాయి. అయినప్పటికి ఆమె ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలైతే చేయడం లేదు. ఓవర్ వెయిట్ కారణంగా ఆమె సినిమాలను తగ్గించింది. తొందరలోనే సర్జరీ చేయించుకొని సన్నబడి మరోసారి ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే నాగార్జున కి మేకప్ మెన్ గా పనిచేసిన చంద్ర అనే ఒక వ్యక్తి అనుష్కను మెయిన్ లీడ్ లో పెట్టి సినిమా తీయాలని అనుకున్నాడు. తను ప్రొడ్యూసర్ గా మారి మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీ లో స్థిరపడాలని చూశాడు. అప్పటికే అనుష్క తనకు క్లోజ్ ఫ్రెండ్ కావడంతో అనుష్క తో నేను ప్రొడ్యూసర్ గా మారుతున్నాను. నాకు సినిమా చేస్తారా అని అడిగారట. దానికి ఆమె ఓకే డైరెక్టర్ ను తీసుకురండి నేను డేట్స్ ఇస్తానని చెప్పిందట. ఇక అందులో భాగంగానే ఆమెకు అడ్వాన్స్ గా చంద్ర 5 లక్షల రూపాయలైతే ఇచ్చాడట.
ఇక ఈలోపు ఆయన వి.సముద్ర అనే దర్శకుడిని తీసుకువచ్చారట. కానీ అప్పటికే అనుష్క చేసిన ‘అరుంధతి’ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక దాంతో చంద్ర లక్కీ పర్సన్ అని అందరు పొగిడారు. ఇక ఈ క్రమంలోనే అనుష్క కి మహేష్ బాబు ఖలేజా సినిమా ఆఫర్ వచ్చింది. దాంతో అనుష్క చంద్ర ను పిలిచి ఖలేజా సినిమా అయిపోయిన తర్వాత మీకు డేట్స్ ఇస్తానని చెప్పిందట.
అప్పుడు చంద్ర అనుష్క రేంజ్ మారిపోయిందని ఇక ఆమె తనకు డేట్స్ ఇచ్చే అవకాశం లేదని కావాలనే పోస్ట్ పోన్ చేస్తుందని అనుకున్నారట. కానీ ఖలేజా సినిమా అయిపోయిన తర్వాత ఆమె చంద్ర కి కాల్ చేసి ఏమైంది సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అని అడిగిందట. దాంతో చంద్ర అనుష్క హ్యాండ్ ఇచ్చింది అనుకున్నాను కానీ ఇవ్వలేదని తను చాలా మంచి వ్యక్తి కాబట్టి మళ్లీ తనే గుర్తు చేసిందని తన సన్నిహితుల దగ్గర కూడా చెప్పాడట.
మొత్తానికైతే వి.సముద్ర డైరెక్షన్లో అనుష్క ను మెయిన్ లీడ్ లో పెట్టి ‘పంచాక్షరి’ అనే సినిమా చేశారు. ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించకపోయినా కూడా చంద్రకి అనుష్క వల్ల మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. దానివల్ల ఆయన చాలావరకు సేఫ్ జోన్ లో ఉన్నానని చెప్పాడు…