Homeఎంటర్టైన్మెంట్Arundhati Movie: 'అరుంధతి' కూడా ఆ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిందా.. ఇన్నేళ్లు ఆడియన్స్ ని...

Arundhati Movie: ‘అరుంధతి’ కూడా ఆ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిందా.. ఇన్నేళ్లు ఆడియన్స్ ని భలే మోసం చూశారుగా..

Arundhati Movie: మన టాలీవుడ్ లోని బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అత్యధిక శాతం సన్నివేశాలు ఇతర బాషల నుండి కాపీ కొట్టినవే ఉంటాయి. అది రాజమౌళి కావొచ్చు , సుకుమార్ కావొచ్చు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కావొచ్చు, వీళ్లకంటూ సొంతంగా క్రియేట్ చేసిన సన్నివేశాలు తక్కువ. హాలీవుడ్ మరియు ఇతర బాషల నుండి సైలెంట్ గా దోచేసిన సన్నివేశాలు ఎక్కువ. కేవలం వీళ్ళు మాత్రమే కాదు , మన దురదృష్టం కొద్దీ సీనియర్ లెజండరీ టాప్ డైరెక్టర్స్ […]

Arundhati Movie: మన టాలీవుడ్ లోని బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అత్యధిక శాతం సన్నివేశాలు ఇతర బాషల నుండి కాపీ కొట్టినవే ఉంటాయి. అది రాజమౌళి కావొచ్చు , సుకుమార్ కావొచ్చు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కావొచ్చు, వీళ్లకంటూ సొంతంగా క్రియేట్ చేసిన సన్నివేశాలు తక్కువ. హాలీవుడ్ మరియు ఇతర బాషల నుండి సైలెంట్ గా దోచేసిన సన్నివేశాలు ఎక్కువ. కేవలం వీళ్ళు మాత్రమే కాదు , మన దురదృష్టం కొద్దీ సీనియర్ లెజండరీ టాప్ డైరెక్టర్స్ కూడా హాలీవుడ్ నుండి కాపీ కొట్టి పాపులర్ సన్నివేశాలను చిత్రీకరించారు. వారిలో లెజండరీ డైరెక్టర్ కోడి రామ కృష్ణ కూడా ఉండడం బాధాకరం. ఆయన దర్శకత్వం లో తెరకెక్కిన ‘అరుంధతి’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అనుష్క శెట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ఆ రోజుల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

ఒక హీరోయిన్ ని ప్రధాన పాత్ర గా పెట్టుకొని , అంత బడ్జెట్ చిత్రాన్ని నిర్మించి ఆరోజల్లో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి పెద్ద సాహసమే చేసాడు. అప్పట్లో ఆ గ్రాఫిక్స్ ని , సన్నివేశాలని థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి. అయితే ఈ చిత్రం లోని అనేక సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాల్లోని పాపులర్ సన్నివేశాలను ప్రేరణలోకి తీసుకొని తెరకెక్కించినవే. ముఖ్యంగా పశుపతి అఘోర గా కోటలోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు , అనుష్క చేత డ్యాన్స్ చేయిస్తాడు గుర్తుందా?, గవ్వల శబ్దం తో నాట్యం ఆడే కళ తో , పశుపతి సజీవ సమాధి చేస్తుంది అరుంధతి. ఆ సన్నివేశాన్ని థియేటర్స్ లో చూస్తున్నప్పుడు కలిగిన అనుభూతి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈ సన్నివేశాన్ని హాలీవుడ్ లో 2004 వ సంవత్సరం లో విడుదలైన ‘ది హౌస్ ఆఫ్ ఫ్లైయింగ్ డ్యాగర్స్ ‘ అనే చిత్రం నుండి కాపీ కొట్టారు.

ఆ సన్నివేశాన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. డ్యాన్స్ తో సహా మక్కీకి మక్కీ ఎలా దింపారో మీరే చూడండి. ఇది చూసిన నెటిజెన్స్ చివరికి ‘అరుంధతి’ కూడా కాపీ యేనా అంటూ సోషల్ మీడియా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మనం కనిపెట్టాము కాబట్టి ఇదొక్క సన్నివేశం బయటపడింది. ఇలా ఆ చిత్రం లోని పాపులర్ సన్నివేశాలు , ఇంకెన్ని సినిమాల నుండి కాపీ కొట్టి తీశారో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఆరోజుల్లోనే అరుంధతి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 70 కోట్ల గ్రాస్ వసూళ్లు , 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్ కి టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper