Manchu Vishnu: మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా కమర్షియల్ సినిమాలను నమ్ముకుంటూ ముందుకు సాగుతున్నాడు. తను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఒకటి రెండు సినిమాలను మినహాయిస్తే మిగిలిన మూవీస్ పెద్దగా సక్సెస్ లను సాధించలేదు. ఆయన ఎలాంటి సినిమాలు చేస్తేబోరేక్షకులు చూస్తారు అనే క్లారిటీ కోల్పోయాడు అందుకే ఆయనకి సక్సెస్ లు రావడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా మంచు విష్ణు ఒకానొక సందర్భంలో ఇద్దరు హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఆ హీరోలు అతనికి నో చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఆ మల్టీ స్టారర్ స్క్రిప్ట్ ను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ అతనికి నో చెప్పిన హీరోలు ఎవరు అంటే ఒకరు నితిన్ కాగా, మరొకరు సుమంత్ కావడం విశేషం…
నితిన్ వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు మంచు విష్ణు నితిన్ తో మనం సినిమా చేద్దామని అడిగారట. దానికి నితిన్ మాత్రం తనకి ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమా చేయడం ఇష్టం లేదని చెప్పారట. ఇక సుమంత్ సైతం డిఫరెంట్ సినిమాలను చేస్తున్నాడు. తన నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు క్లాసికల్ మూవీ గా నిలిచి పోతుంది.
కాబట్టి అతనితో కూడా మంచు విష్ణు సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ సుమంత్ మాత్రం తనకి ఆ కథ నచ్చలేదని చెప్పాడట. మొత్తానికైతే నితిన్ సుమంత్ ఇద్దరు మంచు విష్ణు అఫర్ ను తిరస్కరించినట్టుగా గతంలో కొన్ని వార్తలు ఫిలిం నగర్ సర్కిల్ లో చక్కర్లు కొట్టాయి…ప్రస్తుతం నితిన్ వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. ఎలాగైనా మరోసారి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు…
ఇక ఈ మధ్యకాలంలో సుమంత్ డిఫరెంట్ సినిమాలను చేస్తున్నాడు. ‘అనగనగా’ అనే సినిమాతో ప్రేక్షకులకు మంచి మెసేజ్ అందించిన ఆయన రీసెంట్ గా ‘నూటన్స్ థర్డ్ లా ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే ‘మహేంద్రగిరి వారాహి’ సినిమాతో సెప్టెంబర్ 11వ తేదీన ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు…