Nithiin Remuneration: యంగ్ హీరోల్లో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగే సత్తా ఉన్న హీరోల్లో ఒకరు నితిన్. కానీ మధ్యలో స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో తీసుకున్న కొన్ని పొరపాట్లు కారణం గా , నితిన్ కేవలం మీడియం రేంజ్ హీరో క్యాటగిరీ కే పరిమితం అయ్యాడు. ఇప్పుడు ఆయనకు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడంతో , ఆ మీడియం రేంజ్ హీరో హోదా కూడా ప్రమాదం లో పడింది. గతం లో నితిన్ సినిమాలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 30 నుండి 40 కోట్ల మధ్య లో జరిగేది. కానీ ఇప్పుడు 10 కోట్ల రేంజ్ కి పడిపోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఫ్లాప్స్ ప్రభావం ఆయనపై ఏ రేంజ్ లో పడింది అనేది. ప్రస్తుతం ఆయన చేతుల్లో రెండు సినిమాలు ఉన్నాయి.
ఒకటి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కాగా , మరొకటి నేచురల్ స్టార్ నాని బ్యానర్. ముందుగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చేస్తున్న సినిమా విషయానికి వస్తే , ఈ చిత్రానికి నారీ , సోమ శేఖర్ లు దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి చైతన్య ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక నేచురల్ స్టార్ నాని బ్యానర్ లో చేస్తున్న సినిమా విషయానికి వస్తే , ఈ చిత్రానికి మురళి కాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి అలియాస్ రుక్మిణి అనే టైటిల్ ని ఖరారు చేశారు. రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఒకప్పుడు నితిన్ ఒక్కో సినిమా 8 నుండి 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకునేవాడు. కానీ ఇప్పుడు కేవలం 4 కోట్ల 50 లక్షల రూపాయిలు మాత్రమే తీసుకుంటున్నాడట.
ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు సినిమాలకు ఇదే రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు. వీటిల్లో ఒక సినిమాకు అయితే ఆయన ఇప్పటి వరకు నయా పైసా అడ్వాన్స్ కూడా తీసుకోలేదట. మళ్లీ నితిన్ కి పూర్వ వైభవం రావాలంటే , కచ్చితంగా ఆయన ఒక భారీ బ్లాక్ బస్టర్ ని అందుకోవాలి. ప్రస్తుతం నితిన్ పరిస్థితి ‘ఇష్క్’ చిత్రానికి ముందు ఎలా ఉండేదో , అలా తయారైంది. ఎలా అయితే ఆరోజుల్లో వరుస డిజాస్టర్స్ నుండి తప్పించుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడో, ఇప్పుడు కూడా అదే రేంజ్ లో కం బ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు.