Manchu Lakshmi: మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి చేసే కామెంట్స్ సోషల్ మీడియా లో ఏ రేంజ్ వైరల్ అవుతుంటాయో మనం చూస్తూనే ఉన్నాం. ఆమె పలు ఈవెంట్స్ లో చేసే కామెంట్స్ సోషల్ మీడియా లో పెద్ద మీమ్ మెటీరియల్ గా మారాయి. ఇప్పటికీ ఆ మీమ్స్ ట్రెండ్ అవుతూనే ఉంటాయి , కొన్ని సినిమాల్లో కూడా వాడుకున్నారు. అయితే రీసెంట్ గా మంచు లక్ష్మి ఒక కార్యక్రమం లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంచు కుటుంబం లో పుట్టకపోయుంటే నేను ఈరోజు చాలా పెద్ద స్థాయిలో ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘మా నాన్న మోహన్ బాబు ఇండస్ట్రీ లో లెజండరీ నటుడు, నా సోదరులు హీరోలు గా ఇండస్ట్రీ లో స్థిరపడ్డారు. అయినప్పటికీ కుటుంబం పేరు ఇండస్ట్రీ లో నేను ఎదిగేందుకు ఉపయోగపడలేదు. అంతే కాదు , వాళ్ళు నా ఎదుగుదలకు అడ్డంకి గా మారారు. ఎందుకంటే నేను పితృ స్వామ్య కుటుంబానికి చెందిన అమ్మాయి ని కాబట్టి , నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సొంతం చేసుకోవడానికి ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. మా ఇంట్లోని పురుషుల ప్రభావం నాపై చాలా ఎక్కువగా ఉండేది. అది నాకు ఒక రక్షణ గోడగా నిల్చింది, అదే సమయం లో అడ్డంకి గా మారిన కత్తి లాగా నిల్చింది. నేను ఏదైనా కొత్తగా ప్రయోగం చెయ్యాలని చూస్తే , ఇంట్లో ఎందుకు అని ప్రశ్నించేవారు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ లోకి మంచు అనే పేరు పాపులర్ అయ్యింది నా వల్లే. నా కంటే ముందుగానే విష్ణు , మనోజ్ లు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ పేర్లు ఏం. విష్ణు, ఏం.మనోజ్ అని పడేవి. కానీ నాది మాత్రం మంచు లక్ష్మి అని పడేది. అప్పటి నుండి మా ఇంట్లో వాళ్ళందరూ వెండితెర పై మంచు పేరు ని యాడ్ చేసుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. ఆమె మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో నెటిజెన్స్ ని షాక్ కి గురి చేసింది. సడన్ గా లక్ష్మక ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటున్నారు. అయితే ఆమె చెప్పింది కూడా అర్థం చేసుకోవాలి. బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ప్రతీ నటీనటులు మంచు లక్ష్మి లాగానే ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళ మీద అంచనాలు భారీగా ఉంటాయి, వాటిని అందుకోవడం సాహసమే, ఫ్యామిలీ లేజసీ కోసం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కూడా వాళ్లకు ఉండదు, ఇదే మంచు లక్ష్మి ముఖ్య ఉద్దేశ్యం అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.