TVK Victory: తమిళ నాడు ఉపఎన్నికల్లో టీవీకే విజయ్ వేవ్ పెద్దగా లేదనే చెప్పాలి. సాధారణంగా ప్రభుత్వం లో ఉన్న పార్టీ కి ఉప ఎన్నికల సమయంలో ఏకపక్షంగా ఓట్లు వేస్తుంటారు. TVK కి కూడా అలాగే జరుగుతుందని ఊహించారు కానీ, అలా జరగలేదు. రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, రెండు స్థానాల్లోనూ TVK తో సమానమైన ఓటింగ్ ని నమోదు చేసుకున్నాయి DMK,AIDMK పార్టీలు. ఇంతటి టఫ్ ఫైట్ ఉంటుందని అసలు ఊహించలేకపోయారు రాజకీయ విశ్లేషకులు సైతం. అయితే ఎట్టకేలకు పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ TVK పార్టీ గెలిచింది , కానీ మెజారిటీస్ చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక ఈ ఉప ఎన్నికలకు ముఖ్యం కారణం ఏంటంటే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రీసెంట్ గా టీవీకేలో చేరారు. వారినే విజయ్ బరిలో నిలిపారు.
ముఖ్యంగా మధురాంధగం స్థానం గురించి మాట్లాడుకోవాలి. ఈ స్థానం AIDMK కి కంచుకోట లాంటిది. ఇక్కడి నుండి మరగతం కుమార్ వేల్ పోటీ చేసి 2026 సార్వత్రిక ఎన్నికల్లో 40 వేల మెజారిటీ తో గెలిచాడు. ఇప్పుడు అదే ఎమ్మెల్యే AIDMK కి రాజీనామా చేసి TVK నుండి పోటీ చేసాడు. మెజారిటీ కేవలం 17 వేలు మాత్రమే వచ్చింది. ఇందుకే విజయ్ అభిమానులకు ఇక్కడ TVK గెలిచినప్పటికీ పెద్దగా కిక్ రాలేదు. ఇక ఉప ఎన్నికలు జరిగిన దారపురం గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ కూడా AIDMK ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచింది. AIDMK అభ్యర్థి సత్యభామ కి 17 వేలకు పైగా మెజారిటీ కూడా వచ్చింది. ఈమె ఆ పార్టీ కి రాజీనామా చేసి TVK నుండి పోటీ చేసి నేడు 10 వేల మెజారిటీ తో గెలిచింది. ఇక్కడ కూడా ఆమె మెజారిటీ బాగా తగ్గింది.
ప్రభుత్వం లో ఉన్న పార్టీ కాబట్టి ఈ రెండు స్థానాల్లో విజయ్ కళ్ళు చెదిరే మెజారిటీస్ ని సంపాదించి ఉండాలి . అది జరగకపోవడం వల్లే , రాజకీయ విశ్లేషకులు ఇది పెద్ద విజయం కాదని అంటున్నారు. అంతే కాదు ఈ రెండు స్థానాల్లోనూ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే పార్టీ కి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో డీఎంకే పార్టీ కి మంచి ఓటు శాతం వచ్చింది. దీని అర్థం , డీఎంకే పార్టీ నెమ్మదిగా పుంజుకుంటుంది అని. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.