Trisha Krishnan: ఇది ఓపెన్ సీక్రెటే.. విజయ్ దాచాలి అనుకోవడం లేదు. ఆ నటి రహస్యంగా ఉంచాలి అనుకోవడం లేదు.. మొత్తానికి ఇద్దరు బయటపడిపోతున్నారు. విజయ్ తన భార్యతో అధికారికంగా విడాకులు తీసుకోలేదు. అలాగని త్రిషకు దూరంగా ఉండటం లేదు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో ఇద్దరు తమ రిలేషన్ ను బయట పెట్టుకుంటూనే ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. విజయ్ జీవితంలో త్రిషకు ఎటువంటి స్థానం ఉందో అందరికీ తెలుసు. మరి రియల్ లైఫ్ లో ఆమె పాత్ర ఏంటి.. ఆమెకు ఇటువంటి స్థాయి లభిస్తుంది.. ఈ ప్రశ్నలకు త్రిషనే సమాధానం చెప్పింది.
సాధారణంగా సినిమా తారలు షాపింగ్ మాల్స్.. జువెలరీ షోరూంలు.. మొబైల్ దుకాణాలు ప్రారంభిస్తుంటారు. ఈ కార్యక్రమాలకు హాజరు కావడం కొత్త కాదు. అయితే ఇటువంటి కార్యక్రమాలకు పేరు పొందిన తారలు హాజరైతే అరేంజ్ వేరే ఉంటుంది.. నటి త్రిష కోయంబత్తూర్ ప్రాంతంలో ఓ మొబైల్ షాప్ ఓపెనింగ్ కు హాజరయ్యారు. ఆ సమయంలో అభిమానులు ఆమెకు బ్రహ్మరథం పెట్టారు. ఆమె చేసిన సందడి ఇప్పుడు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో.. విపరీతమైన చర్చకు కారణమవుతోంది. తమిళనాడులో త్రిష కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది.
కోయంబత్తూర్ ప్రాంతంలో మొబైల్ షోరూం ప్రారంభోత్సవానికి త్రిష ఎరుపు రంగు చీరలో దర్శనమిచ్చారు. అభిమానులకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. కారు సన్ రూఫ్ నుంచి.. బయటికి వచ్చి.. అభిమానులకు అభివాదం చేశారు.
త్రిషకు తమిళనాడులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోయంబత్తూరు ప్రాంతంలో జరిగిన కార్యక్రమానికి ఆమె వచ్చిన తీరు కూడా తమిళనాడు రాజకీయాలలో సరికొత్త చర్చకు దారి తీసింది.. అయితే ఆమె వచ్చినప్పుడు జనం ఆ స్థాయిలో హాజరు కావడం పట్ల రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఆమె త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారని.. విజయ్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారని.. అందువల్లే ఈ స్థాయిలో ఆమె తన జన బలాన్ని చూపించుకుంటున్నారని తమిళనాడులో చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే విజయ్ వెంట ప్రత్యక్షంగా.. పరోక్షంగా త్రిష కనిపించారు. విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు.. ఇటీవల విదేశాలలో ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు త్రిష విజయ్ వెంట ఉన్నారు. దీనిని బట్టి విజయ్ ఆమె పొలిటికల్ ఎంట్రీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. త్వరలోనే ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.