Namo Narayana: సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ చిత్రం కమర్షియల్ గా ఇంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో మూర్తి క్యారెక్టర్ కూడా ఒకటి. ఈ పాత్రలో నమో నారాయణ నటించాడు. తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఈయన ప్రేక్షకుల పొట్ట చెక్కలు అయ్యేలా చేసాడు. ఎన్నో ఏళ్ళ నుండి ఈయన ఇండస్ట్రీ లో కొనసాగుతున్నప్పటికీ రానటువంటి గుర్తింపు , కేవలం ‘జైలర్ 2’ తో వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయనకు ఆఫర్లు వెల్లువలాగా కురుస్తున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ అస్వత్ మారిముత్తు దర్శకత్వం లో ‘ధర్మన్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర కోసం నమో నారాయణ ని సంప్రదించారట మేకర్స్. ‘జైలర్ 2’ ని మించిన ఫన్ తో ఆ పాత్ర ఉంటుందట.
ఈ పాత్ర కూడా క్లిక్ అయితే నమో నారాయణ సౌత్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న కమెడియన్ గా మారిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పటికే అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం లో ఈయన కోసం ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ రెడీ చేయడానికి సిద్ధం అయ్యాడట. ఇక టాలీవుడ్ లో ఈయనకు వరుసగా అవకాశాలు వస్తూనే ఉంటాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. 2009 వ సంవత్సరం లో ‘నాడోడిగళ్’ అనే తమిళ చిత్రం తో నమో నారాయణ సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు కానీ , ఆశించిన స్థాయి గుర్తింపు మాత్రం రాలేదు. ఈ ఏడాది ‘కరుప్పు ‘ చిత్రం తో కాస్త గుర్తింపు వచ్చింది , ఇప్పుడు ‘జైలర్ 2’ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. చూడాలి మరి ఈయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది.
ఇక ‘జైలర్ 2’ వసూళ్ల విషయానికి వస్తే , ఈ సినిమా ఊపు ని చూసి కచ్చితంగా కోలీవుడ్ కి మొట్టమొదటి వెయ్యి కోట్ల గ్రాస్ సినిమా గా నిలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ అది చాలా కష్టమని అర్థం అవుతోంది. 13 రోజుల్లో ఈ చిత్రానికి 732 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో 100 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే 830 నుండి 850 కోట్ల గ్రాస్ మాత్రమే వస్తుంది. హిందీ వెర్షన్ లో భారీ విడుదల లేకపోవడం వల్లే , ఈ సినిమా వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ మిస్ అయ్యిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.