Jailer 2 Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ చిత్రం జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం తగ్గలేదు. వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రం స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. మొదటి వారం లోనే 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, 13 రోజుల్లో 730 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే 93 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఇప్పటి వరకు వచ్చిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ వీకెండ్ తో 100 కోట్ల గ్రాస్ మార్కుని దాటేస్తుందట. చాలా మంది తెలుగు స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వని ఈ రికార్డు ని రజినీకాంత్ అవలీలగా దాటేయడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన గ్రాస్ వసూళ్లను ఒకసారి పరిశీలిద్దాం.
తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి 13 రోజుల్లో 185 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. జైలర్ చిత్రానికి ఈ ప్రాంతం నుండి ఫుల్ రన్ లో 188 కోట్ల రూపాయిలు వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డు ని ‘జైలర్ 2’ నేటితో దాటే అవకాశాలు ఉన్నాయి. ఈ వీకెండ్ తో తమిళనాడు రాష్ట్రంలో ప్రతిష్టాత్మక 200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటబోతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి 93 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాయగా, కర్ణాటక నుండి 81 కోట్లు , కేరళ నుండి 72 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 49 కోట్లు , ఓవర్సీస్ నుండి 252 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 732 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 366 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి 300 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, ఇప్పటి వరకు 66 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ చిత్రం 850 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. నార్త్ ఇండియా లో సరైన విడుదల పడుంటే కచ్చితంగా ఈ చిత్రానికి వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చేదని , కోలీవుడ్ చిరకాల కోరిక నెరవేరేదని అంటున్నారు.