Homeఎంటర్టైన్మెంట్Super Star Rajinikanth: 76 ఏళ్ళ వయస్సులో కోలీవుడ్ చిరకాల కోరిక తీర్చబోతున్న రజినీకాంత్!

Super Star Rajinikanth: 76 ఏళ్ళ వయస్సులో కోలీవుడ్ చిరకాల కోరిక తీర్చబోతున్న రజినీకాంత్!

Super Star Rajinikanth: తమిళ సినిమా ఇండస్ట్రీ అంటే చిన్నప్పటి నుండి మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. ఎన్నో సంచలనాత్మక చిత్రాలతో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కోలీవుడ్ లో 18 ఇండస్ట్రీ హిట్స్ ఉంటే , అందులో 16 సినిమాలు రజినీకాంత్ కి సంబంధించినవే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా ‘జైలర్ 2’ 17 వ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అంటే కాదు కోలీవుడ్ […]

Super Star Rajinikanth: తమిళ సినిమా ఇండస్ట్రీ అంటే చిన్నప్పటి నుండి మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు సూపర్ స్టార్ రజినీకాంత్. ఎన్నో సంచలనాత్మక చిత్రాలతో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కోలీవుడ్ లో 18 ఇండస్ట్రీ హిట్స్ ఉంటే , అందులో 16 సినిమాలు రజినీకాంత్ కి సంబంధించినవే ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా ‘జైలర్ 2’ 17 వ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అంటే కాదు కోలీవుడ్ చిరాకాల కోరికని కూడా ఈ సినిమా నెరవేర్చబోతుంది. ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద టాలీవుడ్ , బాలీవుడ్ , శాండిల్ వుడ్ ఇండుస్త్రీలకు సంబంధించిన సినిమాలు 1000 కోట్ల గ్రాస్ ని వసూలు చేశాయి. కానీ తమిళనాడు నుండి ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్ల మార్కుని అందుకోలేదనే లోటు తమిళియన్స్ లో ఉండేది. ఆ లోటు ని ‘జైలర్ 2’ అతి త్వరలోనే పూడ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఇకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి నమోదైన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు. ఒక్క తమిళనాడు నుండే ఈ చిత్రానికి 154 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది రజినీకాంత్ కెరీర్ లోనే సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి స్థానంలో 180 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లతో ‘జైలర్’ చిత్రం కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అతి త్వరలోనే ఇక్కడ వంద కోట్ల గ్రాస్ మార్కుని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా కర్ణాటక రాష్ట్రం నుండి 66 కోట్ల రూపాయిలు , కేరళ రాష్ట్రం నుండి 64 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఫుల్ రన్ లో చెరో వంద కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక నార్త్ ఇండియా నుండి 39 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఓవర్సీస్ లో 217 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 622 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. షేర్ వసూళ్లు 297 కోట్ల రూపాయిలు వచ్చాయట. వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. నేటితో ఆ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందో లేదో తెలియాలంటే వచ్చే వీకెండ్ వరకు ఎదురు చూడాల్సిందే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper