Jailer 2 Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ చిత్రం విడుదలైన 8 రోజుల్లోనే 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని 42 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా, మొదటి 8 రోజులకు కలిపి 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ‘జైలర్’ తర్వాత తెలుగు లో రజినీకాంత్ కి క్లీన్ హిట్ గా నిల్చిన చిత్రమిదే. ఈ సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత నాగవంశీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వరుస ఫ్లాప్స్ లో ఉన్న నాగవంశీ కి ఈ చిత్రం సక్సెస్ కాస్త ఊరటని ఇచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి వెయ్యి కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తున్న ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏ సినిమాకు అయినా డూప్స్ ని వాడడం అనేది సర్వ సాధారణమైన విషయం. ఎందుకంటే స్టార్ హీరో ని నమ్ముకొని వేలాది మంది పని చేస్తుంటారు. పొరపాటున స్తంట్స్ చేసే సమయం లో వాళ్లకు ఏదైతే జరిగితే నెలల తరబడి షూటింగ్స్ ఆగిపోతాయి. వేలాది మంది ఉపాధి కోల్పోతారు. అందుకే మేకర్స్ రిక్స్ తీసుకోకుండా ఫైట్ సన్నివేశాలకు డూప్స్ ని వాడుతుంటారు. ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశం లో మోహన్ లాల్ కి డూప్ గా జోభి కొడకర నటించాడట. క్లైమాక్స్ డ్రైవింగ్ సన్నివేశం లో చేతులు , కాళ్ళు కనిపించే షాట్స్ లో తానే నటించానని చెప్పుకొచ్చాడు. ఇకపోతే సినిమాలో రజినీకాంత్ కేవలం 20 శాతం మాత్రమే స్వయంగా నటించాడని , మిగిలిన 80 శాతం డూప్ తో తెరకెక్కించారని అంటున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియా లో ప్రస్తుతం వేరే లెవెల్ లో ట్రోల్స్ పడుతున్నాయి.
ఎందుకంటే ఈ సినిమాలో రజినీకాంత్ పెద్దగా కష్టపడింది ఏమి లేదు. స్టైల్ గా నడుచుకుంటూ , చొక్కా కూడా నలగకుండా , చాలా కూల్ గా నటించాడు. అయినప్పటికీ కేవలం 20 శాతం మాత్రమే రజినీకాంత్ నటించాడు , మిగిలింది మొత్తం డూప్ అనడం విడ్డూరంగా ఉందని , ఇది రజినీకాంత్ క్రేజ్ ని చూసి తట్టుకోలేక కొంతమంది పుట్టించిన పుకార్లు మాత్రమే అని అంటున్నారు నెటిజెన్స్. ఆ స్టైల్ , స్వాగ్ , స్క్రీన్ ప్రెజెన్స్ ని డూప్స్ మ్యాచ్ చెయ్యలేరని , కేవలం రజినీకాంత్ కి మాత్రమే సాధ్యం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.