Jailer 2 Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘జైలర్ 2’ నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓపెనింగ్స్ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 72 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు తమిళ సినిమాలకు మాత్రమే ఆ రేంజ్ లో టికెట్స్ సేల్ అయ్యాయి. ఆ నాలుగు సినిమాల్లో మూడు రజినీకాంత్ సినిమాలే అవ్వడం గమనార్హం. 72 ఏళ్ళ వయస్సులో కూడా రజినీకాంత్ నేటి జనరేషన్ సూపర్ స్టార్స్ కి సాధ్యం అవ్వని రికార్డ్స్ ని నెలకొల్పుతూ ఎవ్వరికీ అందనంత దూరం లో ఉన్నాడు.
జైలర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడితే , ‘జైలర్ 2’ కచ్చితంగా 800 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి రోజు ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 120 కోట్ల రూపాయలకు పై గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే హిందీ లో నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఈ సినిమా విడుదల లేకపోవడం వల్ల చాలా రెవిన్యూ ని మిస్ అవుతున్నాము అనే భావన నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ లో ఉంది. అందుకు కారణం ఓటీటీ డీల్. హిందీ లో నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఒక సినిమా విడుదల అవ్వాలంటే కనీసం 7 వారాల పాటు ఓటీటీ లో విడుదల చెయ్యకూడదు.
కానీ ‘జైలర్ 2’ కేవలం నాలుగు వారాలకే ఓటీటీ లోకి రానుంది. విడుదలకు ముందు అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ఫ్యాన్సీ రేటుకి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసింది. నాలుగు వారల తర్వాత , అంటే నవంబర్ 14 న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో మనం చూడొచ్చు. ఓటీటీ లో భారీ ఫ్యాన్సీ రేట్స్ కి ఒక సినిమా అమ్ముడుపోవాలంటే , కచ్చితంగా నాలుగు వారాల డీల్ పెట్టుకోవాలి. అందుకే ‘జైలర్ 2’ నిర్మాతలు నాలుగు వారాల డీల్ పెట్టుకున్నారని అంటున్నారు. ఒకవేళ ఈ చిత్రం 4 వారాలు దాటినప్పటికీ కూడా భారీ గ్రాస్ వసూళ్లను రాబడితే , ఒక వారం ఓటీటీ విడుదల వాయిదా పడొచ్చని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఎంత దూరం వెళ్లి ఆగుతుంది అనేది.