Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: ప్రతి అక్షరం లోను ప్రజాస్వామ్యం.. జగన్ గారు మీరు మారిపోయారండి..

YS Jagan: ప్రతి అక్షరం లోను ప్రజాస్వామ్యం.. జగన్ గారు మీరు మారిపోయారండి..

YS Jagan:చంద్రముఖి సినిమా చూశారా.. అందులో గంగా.. చంద్రముఖి ఇలా రెండు షేడ్స్ లో అదరగొడుతుంది జ్యోతిక. ఇప్పటికీ ఒక మనిషి రెండు రూపాలలో కనిపిస్తే కచ్చితంగా చంద్రముఖిలాగా ఉన్నావని అంటుంటాం. పాలిటిక్స్ లో మాత్రం చంద్రముఖి పాత్రను కచ్చితంగా వైసీపీ అధినేత జగన్ కు ఆపాదించాలేమో. ఎందుకంటే ఆయన వ్యవహరిస్తున్న తీరు.. అలా ఉంది మరి. జగన్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ బిల్లు కైనా సరే జై కొట్టారు. […]

YS Jagan:చంద్రముఖి సినిమా చూశారా.. అందులో గంగా.. చంద్రముఖి ఇలా రెండు షేడ్స్ లో అదరగొడుతుంది జ్యోతిక. ఇప్పటికీ ఒక మనిషి రెండు రూపాలలో కనిపిస్తే కచ్చితంగా చంద్రముఖిలాగా ఉన్నావని అంటుంటాం. పాలిటిక్స్ లో మాత్రం చంద్రముఖి పాత్రను కచ్చితంగా వైసీపీ అధినేత జగన్ కు ఆపాదించాలేమో. ఎందుకంటే ఆయన వ్యవహరిస్తున్న తీరు.. అలా ఉంది మరి.

జగన్ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ బిల్లు కైనా సరే జై కొట్టారు. చివరికి తన మీడియాలో.. ఎన్డీఏ నేతల మీద ఒక్క నెగిటివ్ వార్త కూడా పబ్లిష్ చేయలేదు. పైగా ఢిల్లీ వెళ్ళినప్పుడు వంగి వంగి దండాలు పెట్టారు. తన కేసులను విచారణకు రాకుండా చూసుకున్నారు. అంతేకాదు, చంద్రబాబును అరెస్టు చేసి పైసాచికంగా జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అనేక రూపాలలో అడ్డుకున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా బిజెపి నేతలను విమర్శించని జగన్.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత.. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తెలిసిన తర్వాత.. తన అసలు రూపాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే గంగ నుంచి చంద్రముఖిలాగా మారిపోతున్నారు.

మొన్నటివరకు నిశ్శబ్దంగా ఉంటూ వచ్చిన జగన్ ఇటీవల మెల్లగా తన వైఖరి మార్చేసుకుంటున్నారు. తాజాగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్.. ఆశుతోష్ రాంకా అరెస్టుల మీద స్పందించారు. అంతేకాదు, ట్వీట్ కూడా చేశారు. వారి అరెస్టులను తీవ్రంగా తప్పుపట్టారు. అక్కడితోనే ఆగిపోలేదు.. అవసరమైతే కాక్రోచ్ అవుతానని (గతంలో చెప్పారు) పేర్కొన్నారు.

జగన్ వదిలిన ట్వీట్ లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏపీలో భారీ విజయం సాధించింది. మొన్నటి వరకు కూడా కేంద్రానికి జగన్ అనుకూలంగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఈ పరిణామాలు గమనిస్తుంటే రాజకీయంగా జగన్ పూర్తిస్థాయిలో చంద్రముఖిలా మారిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు మీద రాజకీయంగా విమర్శలు చేసేందుకు ఒక విధానాన్ని జగన్ అనుసరించేవారు. ఇప్పుడు తన సొంత పాలిటిక్స్ కోసం.. పొలిటికల్ మైలేజ్ కోసం ఏకంగా కేంద్రంపై ఎదురుదాడికి దిగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరి కేంద్రానికి జగన్ దాసోహం అయ్యారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత హఠాత్తుగా కేంద్ర విధానాలను తప్పుపడుతున్నారు. ఇదంతా కూడా రాజకీయ డ్రామా అని విశ్లేషకులు చెబుతున్నారు.

సౌరవ్ దాస్, అశుతోష్ రాంక అరెస్టు ద్వారా ఏపీలో ఏదో విధంగా సానుభూతి పొందాలని జగన్ భావిస్తున్నారు. ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఎన్నికలలో ప్రజలు ఆయనను ఘోరంగా తిరస్కరించినప్పటికీ.. ఆయన పాత ధోరణిలో ఎటువంటి మార్పు రాలేదు. దానికి నిదర్శనమే ఈ ట్వీట్లు. అప్పట్లో కేంద్రంతో జగన్ సఖ్యంగా ఉండేవారు. అన్ని పనులు చేయించుకునేవారు. ఇప్పుడు చంద్రబాబు కీలకపాత్ర పోషించడం.. ఒక రకంగా కేంద్రంలో చంద్రబాబుకు అత్యంత ప్రయారిటీ తగ్గడంతో జగన్ తట్టుకోలేకపోతున్నారు. పైగా చంద్రబాబు ఏం చెప్తే మోడీ అది చేస్తున్నారు. ఇది కూడా జగన్ కు నచ్చడం లేదు. అందువల్లే ప్లేట్ మార్చారు. ఇది జగన్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని టిడిపి నేతలు అంటున్నారు.

జగన్ చేస్తున్న రాజకీయ విన్యాసాలు ప్రజలను మరోసారి మోసం చేయడం తప్ప మరో ఉద్దేశమే లేదని టిడిపి నేతలు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్నారని.. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కేంద్రం మీద తిరుగుబాటు చేస్తున్నట్టు జగన్ బిల్డప్ ఇస్తున్నారని.. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజాక్షేమం కాదని టిడిపి నేతలు అంటున్నారు. ఇటువంటి గ్రామాలను ఏపీ ప్రజలు గమనించారని.. కాబట్టి ఆయన చేసిన ట్వీట్ లను సీరియస్ గా తీసుకోవలసిన అవసరం లేదని టిడిపి నేతలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper