Jailer 2 Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టు ఓపెనింగ్స్ కూడా అన్ని ప్రాంతాల్లోనూ అదిరిపోతున్నాయి. అయితే ‘జైలర్’ తరహా లోనే ‘జైలర్ 2’ లో కూడా ప్రముఖ స్టార్ హీరోలు క్యామియో రోల్స్ లో కనిపించారు. జైలర్ చిత్రం అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఈ క్యామియో రోల్స్ కూడా చాలా ఉపయోగపడ్డాయి. ఒక సినిమాలో క్యామియో రోల్స్ ని ఎలా ఉపయోగించుకోవాలో చూపెట్టిన చిత్రమిది. ‘జైలర్ 2’ లో కూడా క్యామియో రోల్స్ సినిమా బలాన్ని బాగా పెంచాయి అని చెప్పొచ్చు. మొదటి భాగం లో ఉన్నటువంటి శివ్ రాజ్ కుమార్ , మోహన్ లాల్ వంటి వారు ‘జైలర్ 2’ లో కూడా ఉన్నారు.
వాళ్ళిద్దరి క్యామియో రోల్స్ కి థియేటర్ లో బ్లాస్టింగ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా సినిమా చివర్లో వచ్చే విజయ్ సేతుపతి రోల్ కి కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ‘జైలర్ 3’ చిత్రం లో ఆయన ఉండబోతున్నాడు అనే హింట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్. ఇకపోతే ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ క్యామియో కి థియేటర్స్ లో పగిలిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. స్వాగ్, స్టైల్ , స్క్రీన్ ప్రెజెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉండే రజినీకాంత్ , హృతిక్ రోషన్ లను ఒకే ఫ్రేమ్ లో చూసిన ఆడియన్స్ మెంటలెక్కిపోయారు. అయితే ఈ క్యామియో రోల్ కోసం హృతిక్ రోషన్ దాదాపుగా 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకున్నాడని కోలీవుడ్ లో వినిపిస్తున్న రూమర్.
అయితే మరికొంతమంది మాత్రం హృతిక్ రోషన్ ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు , రజినీకాంత్ మీద అభిమానం తో ఈ క్యామియో రోల్ చేసి వెళ్ళాడు. దాదాపుగా నాలుగు రోజుల పాటు హృతిక్ రోషన్ క్యామియో సన్నివేశాలను డైరెక్టర్ చిత్రీకరించాడని అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజమో తెలియదు కానీ , హృతిక్ కారణంగా బాలీవుడ్ లో ఈ సినిమాకు వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఇది కాసేపు పక్కన పెడితే హృతిక్ రోషన్ పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ని సంప్రదించారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆయన ఈ సినిమా చేయలేకపోయాడు. ఆ తర్వాత మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని సంప్రదించారు. ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ గా ఉండడం వల్ల చేయలేకపోయాడు. చివరికి అది హృతిక్ రోషన్ చేతుల్లోకి వెళ్ళింది. ఒకవేళ ఈ క్యామియో రోల్ ని పవన్ కళ్యాణ్ చేసి ఉండుంటే తెలుగు లో ఓపెనింగ్స్ వేరే లెవెల్ లో ఉండేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.