Media Owner Controversy: ఆ పత్రిక యజమాని తీరే వేరు. బూతు అనేది ఆయనకు పర్యాయపదం. ఎదుటివారి గృహాలలో జరిగే విషయాలను ఆయన టెలిస్కోప్ కెమెరాలో చూస్తారు. పైగా తన పత్రికలో బ్యానర్ వార్తగా వేస్తుంటారు. తాటికాయ పరిమాణంలో అక్షరాలతో రాసేస్తూ ఉంటారు. మొదటినుంచి ఆ పత్రిక యజమాని తీరే అంత. నచ్చితే అహో ఓహో అంటూ పొగిడేస్తుంటారు. నచ్చకపోతే బురద చల్లుతూ ఉంటారు. పైగా దానిని ఆయన దమ్మున్న జర్నలిజమని చెబుతుంటారు.
తన ప్రయోజన విషయంలో ఆ పత్రిక యజమాని ఏమాత్రం రాజీపడడు.. కరోనా సమయంలో ఎంతో మంది ఉద్యోగులను మెడపట్టి బైటికి గెంటేశాడు ఆ యజమాని. పైగా ఉన్న ఉద్యోగుల జీతాల్లో కూడా కోతలు విధించాడు. దీనికి తోడు ఇంక్రిమెంట్ విషయంలో కూడా ఏదో సామెతను గుర్తు చేశాడు. ఆయన సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులకు గత్యంతరం లేదు కాబట్టి తప్పడం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో పెద్దగా పెద్ద చేయి చూపించని ఆయన.. తనకు మాత్రం భారీ భవంతి కట్టుకున్నాడు. తన పత్రికను.. ఛానల్ ను అందులోకి మార్చుకున్నాడు. అంతేకాదు ఏకంగా పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులను తన దగ్గరికి పిలిపించుకుంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ పెద్దమనిషి బుద్ధి మరోసారి లేకిగా మారిపోయింది. వాస్తవానికి ఆయనను దగ్గర నుంచి చూసిన ఎవరికైనా సరే ఇదే అనిపిస్తుంది. కాకపోతే బూతు అనేది ఆయనకు పర్యాయపదం కాబట్టి పత్రికలో ఏం రాస్తాడో.. చానల్లో ఏం చూపిస్తాడో అనే భయంతో చాలామంది ఆ మాట బయటపెట్టరు.
కాకపోతే తన మామ వ్యవహార శైలి తెలుసు కాబట్టి ఆయన సంస్థలు పనిచేసిన అల్లుడు అసలు నిజం బయటపెట్టాడు. మంది కొంపలోకి చూసే ముందు.. మన ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలి అని చురకలు అంటించాడు. దీంతో ఆ పత్రికా యజమాని కొంపలో ఏం జరుగుతుందో అందరికీ అర్థమైంది. ఇక అప్పటినుంచి ఆ పత్రిక యజమాని ఆయన అల్లుడిని దూరం పెడుతున్నారు. మొన్నటిదాకా తన ఛానల్ లో పనిచేసినప్పుడు ఆయనకు ఒక అధికారికంగా హోదా ఉండేది. ఇప్పుడు ఆ హోదా కూడా పూర్తిగా రద్దు చేశారు. కొడుకు.. కోడలు.. కుమార్తెకే పెత్తనం ఇచ్చారు. ఇటీవల ఏపీలో ఓ రాజకీయ నాయకుడికి.. ఆయన సోదరికి జరుగుతున్న వ్యవహారాన్ని బీభత్సంగా రాసిన ఈ పత్రిక యజమాని.. మరి ఇప్పుడు తన సొంత అల్లుడు విషయంలో తాను చేస్తున్న విషయాన్ని ఎందుకు బయట పెట్టడం లేదు.. ఎందుకు ఆ విషయాన్ని దాస్తున్నారు.. అల్లుడికి పత్రికలో.. పనిచేసే సంస్థలు ఎందుకు చోటు ఇవ్వడం లేదు.. వీటికి సమాధానం చెప్పాలని ఆ రాజకీయ నాయకుడి పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన మన వీపు మనకు కనబడదు.. ఈ సామెతను ఆ పత్రిక యజమాని నిజం చేసి చూపిస్తున్నారు. ఎంతైనా గురువింద గింజ నీతులు ఎరుగదు కదా..