Homeఎంటర్టైన్మెంట్Ravi Teja : కూతురుతో కలిసి 'ఇరుముడి' కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : కూతురుతో కలిసి ‘ఇరుముడి’ కి డబ్బింగ్ చెప్తున్న రవితేజ.. వీడియో వైరల్..

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో తీస్తుండడంతో పాటు , రవితేజ తన రొటీన్ మాస్ కమర్షియల్ ఫార్ములా కి భిన్నంగా తీస్తుండడంతో ఆయన అభిమానుల్లోనే కాకుండా, మూవీ లవర్స్ లో కూడా ఈ చిత్రం ఆసక్తి నెలకొంది. దానికి తోడు రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ […]

Ravi Teja : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ పై మార్కెట్ లో ఎవ్వరూ ఊహించని రేంజ్ బజ్ ఏర్పడింది. సుబ్రమణ్యస్వామి బ్యాక్ డ్రాప్ లో తీస్తుండడంతో పాటు , రవితేజ తన రొటీన్ మాస్ కమర్షియల్ ఫార్ములా కి భిన్నంగా తీస్తుండడంతో ఆయన అభిమానుల్లోనే కాకుండా, మూవీ లవర్స్ లో కూడా ఈ చిత్రం ఆసక్తి నెలకొంది. దానికి తోడు రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ బాగా పేలింది అనే చెప్పాలి. గ్లింప్స్ వీడియో తో పాటు , ‘ఇరుముడి కట్టు’ పాట ఈ చిత్రం పై అప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలను రెట్టింపు చేసింది. ఇకపోతే నేడే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ విషయాన్ని డైరెక్టర్ శివ నిర్వాణ చాలా క్రియేటివ్ గా , ఒక వీడియో ద్వారా తెలియజేసారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ముందు గా ఈ చిత్రం లో రవితేజ కూతురు పాత్ర పోషించిన నక్షత్ర డబ్బింగ్ మొదలు పెడుతుంది. ఆమె ‘స్వామియే’ అనగానే , రవితేజ ‘శరణమయ్యప్ప’ అంటూ వస్తారు. ‘అప్పుడే డబ్బింగ్ మొదలు పెట్టావా బంగారం’ అని రవితేజ అనగా, ‘మీరు కూడా మొదలు పెట్టండి’ అని నక్షత్ర అంటుంది. ఈ వీడియో లో వీళ్లిద్దరి మధ్య ఉన్నటువంటి క్యూట్ బాండింగ్ ని చూస్తుంటే, వెండితెర పై వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం అవుతోంది. ‘నాకు ఒకే ఒక్క కూతురు.. పేరు మణమ్మ’ అని రవితేజ డబ్బింగ్ మొదలు పెట్టడం , ఆ తర్వాత సినిమాలోని కొన్ని విజువల్స్ చూపించడం వంటివి రవితేజ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రప్పించే మూమెంట్స్ అనే చెప్పాలి.

తండ్రి, కూతురు మధ్య రిలేషన్ ని అద్భుతంగా వెండితెర పై ఆవిష్కరించిన సినిమా ఈ మధ్య కాలం లో రాలేదు. ఒకవేళ ఈ సినిమా ఆ విధంగా తీస్తే మాత్రం రవితేజ కం బ్యాక్ ఎవ్వరూ కలలో కూడా ఊహించని రీతిలో ఉంటుంది. అవలీలగా ఆయన ఈ మొదటి వారం లోనే వంద కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టగలడు. ఈ మూమెంట్ కోసం కేవలం రవితేజ ఫ్యాన్స్ మాత్రమే కాదు , టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. మరి ఆ ఎదురు చూపులకు తగ్గ ఫలితం ఆగస్టు 21 న ఈ సినిమాకు దక్కుతుందో లేదో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రముఖ కోలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ నటిస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper