Animal: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక అందులో భాగంగానే సినిమా డైరెక్టర్లు అయితే వాళ్ళ సినిమాని షూట్ చేయడానికి గాని రిలీజ్ చేయడానికి కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇక ఇలాంటి క్రమంలోనే డైరెక్టర్లు మాత్రం తమదైన రీతిలో మంచి స్క్రిప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అసలైన హిట్లు కొడుతూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.
అయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అనిమల్ సినిమా వైలెంట్ గా ఉండబోతుంది అనే విషయం అయితే మనకి అనిమల్ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే గతంలో సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో అర్జున్ రెడ్డి లాంటి ఒక ప్రేమికుడి బాధ ఎలా ఉంటుంది అనే ఆయన ఒక వేదనని చెప్తుంటే అందరూ దాన్ని వైలెంట్ సినిమా అని, బూతు సినిమా అని పబ్లిసిటీ చేశారు కానీ అసలైన వైలెంట్ సినిమా అంటే ఏంటో అనిమల్ సినిమా ద్వారా చూపిస్తానని తను గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఆయన చెప్పినట్టు గానే ప్రస్తుతం అనిమల్ సినిమాని ఒక వైలెంట్ మూవీగా తెరకెక్కించాడు అనే విషయం అయితే ట్రైలర్ చూస్తుంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైలెంట్ అంటే మామూలు వైలెంట్ కాదు భారీ రేంజ్ లో ఉండే వైలెంట్ సినిమాని చేస్తున్నాడు. ఇక ఇప్పటితో సందీప్ రెడ్డి వంగ పొటెన్షియాలిటీ ఏంటి అనేది ఇండియా రేంజ్ లో మరోసారి చూపించబోతున్నాడు ఈ సినిమాతో ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతాడు అని అందరికీ ఒక స్పష్టత అయితే వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో చేసే స్పిరిట్ సినిమా మీద అందరి ఆశలు ఉన్నాయి.ఇక స్పిరిట్ సినిమాని మరే రేంజ్ లో తీస్తాడు అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది.
నిజానికి సందీప్ రెడ్డి వంగతో మాత్రమే ప్రభాస్ మరో భారీ హిట్టు కొట్టబోతున్నాడు అనేది అతని ఫ్యాన్స్ ఇప్పటినుంచి భారీ అంచనాలను పెట్టుకున్నారు… ఇక అనిమల్ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తో పాటుగా ఈసారి ఎడిటింగ్ కూడా తనే చేయడం విశేషం… మొత్తానికి అయితే తెలుగు సినిమా డైరెక్టర్ పేరు పాన్ ఇండియా వైడ్ గా మరోసారి ఘనంగా వినిపించబోతుందనే విషయం అయితే చాలా క్లారిటీగా తెలుస్తుంది…