spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 8 Telugu: భార్యకు భయపడి బిగ్ బాస్ 8 ఆఫర్ వదులుకున్న స్టార్......

Bigg Boss 8 Telugu: భార్యకు భయపడి బిగ్ బాస్ 8 ఆఫర్ వదులుకున్న స్టార్… ఇదెక్కడి మాస్ రా మామ!

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 1న జరగనుంది. అఫీషియల్ ప్రకటన కూడా రావడంతో బిగ్ బాస్ లవర్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ క్రమంలో కొందరు కంటెస్టెంట్స్ పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. రీతూ చౌదరి, విష్ణు ప్రియ, నటుడు ఖయూమ్, యాష్మి గౌడ, బంచిక్ బబ్లు, తేజస్విని గౌడ, అక్షిత, నటి సన, బెజవాడ బెబక్క, సింగర్ సాకేత్, జబర్దస్త్ పవిత్ర, నిఖిల్ లేటెస్ట్ సీజన్ లో కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇవ్వనున్నారట.

సీరియల్ నటుడు మొగలిరేకులు ఫేమ్ ఇంద్రనీల్ కూడా సీజన్ 8 లో పార్టిసిపేట్ చేయబోతున్నాడని, చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో అతని ఫైనల్ ఇంటర్వ్యూ కూడా పూర్తయిందని తెలుస్తుంది. ఇంద్రనీల్ బిగ్ బాస్ 8 కి సెలెక్ట్ అయ్యారట. కానీ అగ్రిమెంట్ చేయలేదు. దీనికి కారణం ఇంద్రనీల్ భార్య అని తెలుస్తుంది. బిగ్ బాస్ కి వెళ్ళడానికి వీల్లేదని ఇంద్రనీల్ భార్య కచ్చితంగా చెప్పేసిందట. ఎందుకంటే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా సెలెబ్రెటీలు గుర్తింపు తెచ్చుకుని కెరీర్ లో ఎదిగిన వారు కొందరైతే.

ఉన్న పేరు బద్నాం అయ్యి బిగ్ బాస్ ఆటకు బలైన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ప్రతి సీజన్లో ఒకరిద్దరిని టార్గెట్ చేసి వారిని ఎంత నెగిటివ్ చెయ్యాలో అంత నెగటివ్ చేసి పారేస్తాడు బిగ్ బాస్. ఏదో చెయ్యాలని హౌస్ లోకి వెళ్లి ఇంకేదో అయ్యి వస్తారు. లోపల ఎంత మంచిగా ఉన్నా బిగ్ బాస్ మాత్రం తనకు కావలసిన కంటెంట్ మాత్రమే ఎడిట్ చేసి చూపిస్తాడు. ఇంద్రనీల్ కి బుల్లితెర ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పేరుంది. ఆదరణ ఉంది. ఆ పేరు పోకూడని భావించిన భార్య మేఘన వద్దని చెప్పారట.

పైగా బయట సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ బిగ్ బాస్ ఫ్యాన్స్ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా లాగి నోటికొచ్చినట్టుగా తిడుతుంటారు. సోషల్ మీడియా వేధింపులకు పాల్పడతారు. గత సీజన్లో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ విషయంలో ఎంత క్రూరంగా ప్రవర్తించారో తెలిసిందే. అమర్ కారు పై దాడి చేశారు. అతని కుటుంబాన్ని కూడా ఇబ్బందులకు గురి చేశారు. ఇవన్నీ చూసి భయపడి ఇంద్రనీల్ బిగ్ బాస్ కి వెళ్లకూడదని మేఘన అడ్డుకుంటున్నారట. బిగ్ బాస్ రివ్యూవర్ అయిన స్పై అక్క ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.

Related News

Most Popular

Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Jana Nayagan Movie

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...
Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Oktelugu Epaper