Homeఎంటర్టైన్మెంట్కేవలం డబ్బు కోసమే చేశాను: హెబ్బా పటేల్

కేవలం డబ్బు కోసమే చేశాను: హెబ్బా పటేల్

హీరోయిన్ హెబ్బా పటేల్ ఇప్పుడు మారిపోయిన యువతి. చిన్న తనంలోనే ఇండస్ట్రీకి రావడం, దానికి తగ్గట్టు ఎలాంటి కష్టాలు లేకుండా అవకాశాలు రావడం, పైగా మెచ్యూరిటీ లేకపోవడంతో ఏది పడితే అది చేసిందట. అయితే ఈ క్రమంలో తాను ఎన్నో కోల్పోవాల్సి వచ్చింది అని, అలాగే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాను అని.. ఇప్పుడు ఈ ప్రపంచం ఎలాంటిదో అర్థం చేసుకున్నాను అని, అనుభవం నేర్పిన పాఠాలతో మళ్ళీ కెరీర్ ను స్టార్ట్ చేస్తాను అని చెప్పుకొచ్చింది […]

Hebba Patelహీరోయిన్ హెబ్బా పటేల్ ఇప్పుడు మారిపోయిన యువతి. చిన్న తనంలోనే ఇండస్ట్రీకి రావడం, దానికి తగ్గట్టు ఎలాంటి కష్టాలు లేకుండా అవకాశాలు రావడం, పైగా మెచ్యూరిటీ లేకపోవడంతో ఏది పడితే అది చేసిందట. అయితే ఈ క్రమంలో తాను ఎన్నో కోల్పోవాల్సి వచ్చింది అని, అలాగే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాను అని.. ఇప్పుడు ఈ ప్రపంచం ఎలాంటిదో అర్థం చేసుకున్నాను అని, అనుభవం నేర్పిన పాఠాలతో మళ్ళీ కెరీర్ ను స్టార్ట్ చేస్తాను అని చెప్పుకొచ్చింది హెబ్బా.

ఉన్నట్టు ఉండి హెబ్బా లో చాలా మార్పు వచ్చింది. నిజానికి హెబ్బా పటేల్ అనేక సినిమాల్లో నటించినా ఆమెను సి గ్రేడ్ హీరోయిన్ గానే గుర్తిస్తున్నారు. అదే ‘కుమార్ 21F’ సినిమా విడుదల తరువాత హెబ్బా అంటే, ఒక గౌరవం ఉండేది, కానీ ఆ సినిమా తరువాత ఆమె నటించిన ఏ సినిమా ఆమెకు పేరు తీసుకురాలేదు. నితిన్ నటించిన ‘భీష్మ’ వంటి సినిమాల్లో ఐటమ్ పాత్ర చేయాల్సి వచ్చింది.

అయితే ఐటమ్ పాత్రల్లో ఎందుకు కనిపించారు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో తనను హేళన చేస్తున్నారని.. ఒక హీరోయిన్ తన కెరీర్ ను మెయింటైన్ చేయాలి అంటే.. చాలా ఉంటాయని, దానికి బోలెడంత డబ్బు అవసరం అవుతుంది అని, ఆ డబ్బు తన దగ్గర లేదని, అందుకే తానూ అలాంటి పాత్రలు కేవలం డబ్బు కోసమే చేశానని చెప్పుకొచ్చింది.

కథలు నచ్చకపోయినా, నేను చేసే పాత్రల పై అసహ్యం కలిగినా నటించాను అని కుండబద్దలు కొడుతోంది హెబ్బా. అయితే ఇక నుండి నటిగా సంతృప్తినిచ్చే పాత్రలనే చేస్తోందట. అన్నట్టు హెబ్బా త్వరలోనే ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే డ్రామాలో కనిపించనుంది. ఈ డ్రామాలో హెబ్బాది సగటు గృహిణి పాత్ర. గ్లామర్ లేని పాత్ర. మొత్తానికి హెబ్బాలో చాల మార్పు వచ్చింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper