Bigg Boss Season 10: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకువిపరీతమైన స్టార్ డమ్ వస్తుంది. దానిని కాపాడుకుంటూ మంచి సినిమాలు చేసినవారు ఇక్కడ ఎక్కువ కాలం పాటు కొనసాగుతారు. సక్సెస్ లను సాధించలేని వారు మాత్రం ఫెయిల్యూర్ హీరోలుగా మారిపోతారు. తద్వారా ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోతున్నారు. ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న వాళ్లే కావడం విశేషం… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమాతో పాటు ప్రేక్షకులకు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్న ప్లాట్ఫామ్ లు కూడా చాలానే ఉన్నాయి. వాటిలో బిగ్ బాస్ షో భారీ పాపులారిటిని సంపాదించుకుంది. ఇప్పటివరకు తొమ్మిది సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ పదో సీజన్ కోసం రంగం సిద్ధం చేసుకుంటుంది. తొందర్లోనే ఈ బిగ్ బాస్ పదో సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించిన ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది. ఇక అందులో భాగంగానే ఒక స్టార్ హీరో కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఏంటీ ఇవ్వబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే ఒకప్పుడు ప్రేమదేశం సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన అబ్బాస్ కావడం విశేషం… హీరో గా తన కెరియర్ ముగిసిపోవడంతో న్యూజిలాండ్ వెళ్లిపోయి అక్కడ ఒక పెట్రోల్ బంక్ లో పని చేశాడు. ఆ తర్వాత అక్కడే జాబ్ చేసుకుంటూ సెటిలైపోయాడు. అలాంటి అబ్బాస్ రీసెంట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయనకు భారీ ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. అందులో భాగంగానే తెలుగు బిగ్ బాస్ యాజమాన్యం సైతం అతన్ని బిగ్ బాస్ షో లోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. నిజానికి అబ్బాస్ కి చాలా మంచి క్రేజ్ ఉంది. 90స్ కిడ్స్ అయితే అతనికి వీరాభిమానులనే చెప్పాలి.
ఒకవేళ అబ్బాస్ కనక బిగ్ బాస్ సీజన్ లోకి అడుగుపెడితే మాత్రం షో కి మరింత హైప్ పెరుగుతుంది. అలాగే అబ్బాస్ కి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించే అవకాశం కూడా ఉంది…నిజంగానే అబ్బాస్ వస్తున్నాడా లేదా అనే విషయాన్ని బిగ్ బాస్ యాజమాన్యం తొందర్లోనే అఫిషియల్ గా అనౌన్స్ చేయబోతుందట…