
తెలంగాణలో పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి ఉత్తరప్రదేశ్ నుంచి జార్ఖండ్ మీదుగా దక్షిణ ఛత్తీస్ గఢ్ వరకు సముద్ర మాట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని పేర్కొంది. రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.