Homeఆధ్యాత్మికంToday 3 August 2026 Horoscope: ఈ రాశుల వారు ఈరోజు కొత్త పెట్టుబడులు పెడుతున్నారా..?

Today 3 August 2026 Horoscope: ఈ రాశుల వారు ఈరోజు కొత్త పెట్టుబడులు పెడుతున్నారా..?

Today 3 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు పెట్టుబడును పెడితే అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు […]

Today 3 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు పెట్టుబడును పెడితే అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు కుటుంబ సభ్యుల తో సంతోషంగా ఉంటారు. గతంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లలు పోటీ పరీక్షలో పాల్గొంటే తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. పూర్వికుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు వస్తువుల అమ్మకాల విషయంలో పురోగతి సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు పొందుతారు. మానసిక ప్రశాంతత కోసం కావాల్సిన విశ్రాంతి తీసుకోవాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే అనర్ధాలు జరిగే అవకాశం ఉంది. ఇంట్లోని రహస్యాలను ఇతరులకు చెప్పకుండా ఉండాలి. స్నేహితులతో సరదాగా ఉంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో అన్ని కలిసి వస్తాయి. తమ నైపుణ్య ప్రదర్శన ద్వారా పదోన్నతిని పొందే అవకాశం ఉంటుంది. కష్టపడి పనిచేసిన వారికి సరైన ఫలితాలు ఉంటాయి. పెద్దల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొత్త వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కానీ ఇదే సమయంలో ఖర్చులు కూడా ఉంటాయి. గతంలో ఉన్న కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో కంటే ఈరోజు అధిక శ్రమ పడాల్సి వస్తుంది. అయితే కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా ఓర్పు అవసరం. అనవసరపు వివాదాల్లోకి తలదూచకుండా ఉండాలి. ఉద్యోగులకు అదనపు ఆదాయం ఏర్పడుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే పెద్దలను సంప్రదించిన తర్వాతనే ముందుకు వెళ్లాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. గతంలో మొదలు పెట్టిన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల తో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు అనుకున్న పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడమే మంచిది. కొత్త వస్తువుల కొనుగోలు జోలికి వెళ్ళవద్దు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు అధిక ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అండదండలతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి. తోటి వారి సహకారం కూడా ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను సమయానికి అనుకూలంగా పూర్తి చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటారు. అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను ఇతరులతో పంచుకోవద్దు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు అదరపు బాధ్యతలను చేపడతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆరోగ్య క్రియలు చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. అనవసరపు వివాదాల జోలికి వెళ్లకుండా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper