
పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. గురువారం లీటర్ పెట్రోల్ పై 26 పైసలు, డీజిల్ లీటర్ కు 7 పైసల వరకు పెంచాయి. ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.76, డీజిల్ రూ. 88.30కి పెరిగింది. ముంబైలో పెట్రోల్ రూ. 103.89కు చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 101.60, డీజిల్ ధర రూ. 96.25 గా ఉంది.