spot_img
Homeఎంటర్టైన్మెంట్Poonam Kaur: చంద్రబాబు అరెస్ట్ పై హీరోయిన్ పూనమ్ కౌర్ షాకింగ్ రెస్పాన్స్.. ఇంతకీ ఏమందంటే?

Poonam Kaur: చంద్రబాబు అరెస్ట్ పై హీరోయిన్ పూనమ్ కౌర్ షాకింగ్ రెస్పాన్స్.. ఇంతకీ ఏమందంటే?

Poonam Kaur: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మూడు వందల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఖండిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుండి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నేడు బాలకృష్ణతో పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో పవన్ కళ్యాణ్ ఆయన్ని కలవనున్నారు.

కే రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీ దత్ చంద్రబాబు అరెస్ట్ ని ఖండించారు. అశ్వినీ దత్ అయితే సీఎం జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఏపీలో 160 సీట్లతో అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించాలన్నారు. జగన్ కి ఎందుకు భయపడుతున్నారు? ఆయనేమైనా ఉరి తీస్తాడా? అంటూ మండిపడ్డారు. కనీసం ట్వీట్ చేసి వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా చిత్ర పరిశ్రమకు చెందిన మరొక సెలెబ్ నటి పూనమ్ కౌర్… చంద్రబాబు అరెస్ట్ ని వ్యతిరేకించారు. ప్రజాసేవలో సుదీర్ఘ కాలం ఉన్న చంద్రబాబు వంటి నేతను ఈ వయసులో జైలులో పెట్టడం సరికాదని ఆమె అభిప్రాయపడుతున్నారు. పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా…”73 ఏళ్ల వయసులో జైల్లో ఉంచడం సరికాదు. ముఖ్యంగా ప్రజా జీవితంలో ఏళ్ల తరబడి ఉన్న వ్యక్తి జైలుపాలు కావడం బాధాకరం. ఈ విషయాలపై మాట్లాడటానికి నాకు ఎలాంటి అధికారం, సంబంధం లేదు. కేవలం మానవతా దృక్పథంతో స్పందించాను. చంద్రబాబు నాయుడు వయసు, ఆరోగ్యం పరిగణలోకి తీసుకొని మానవత్వంతో ఆలోచించాలని కోరుతున్నాను” అని కామెంట్ చేశారు.

పూనమ్ కౌర్ ట్వీట్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏ వయసు వారికైనా చట్టం ఒకటే. తప్పు చేస్తే శిక్ష తప్పదని కొందరు ఆమె అభిప్రాయాన్ని ఖండిస్తున్నారు. కొందరు మాత్రం చంద్రబాబుకి మద్దతు తెలిపిన ఆమె తెగువను కొనియాడుతున్నారు. పూనమ్ కౌర్ గొప్పగా చెప్పారని అంటున్నారు. పూనమ్ కౌర్ తరచుగా సోషల్, పొలిటికల్ విషయాలపై స్పందిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆమె ట్వీట్స్ సంచలనం రేపుతుంటాయి. నటిగా పూనమ్ కౌర్ కెరీర్ నెమ్మదించింది. ఆమె అడపాదడపా చిత్రాల్లో కనిపిస్తున్నారు. గత ఏడాది నాతిచరామి టైటిల్ తో ఓ మూవీ చేశారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper