Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: గొడ్డలి పార్టీ కక్ష సాధింపు ఓడిపోయింది.. నిజం గెలిచింది.. నారా లోకేష్ సంచలన...

Nara Lokesh: గొడ్డలి పార్టీ కక్ష సాధింపు ఓడిపోయింది.. నిజం గెలిచింది.. నారా లోకేష్ సంచలన ట్విట్..

Nara Lokesh: గొడ్డలి పార్టీ సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ను ఎటువంటి ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేసింది. అత్యంత దారుణంగా అర్ధరాత్రి పూట రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. దాదాపు 53 రోజులపాటు ఆయనను నిర్బంధించింది. అసలు ఎటువంటి అక్రమం జరగలేదని కోర్టులు చెబుతున్నప్పటికీ.. ప్రభుత్వం దగ్గర ఉన్న జీవోల ద్వారా స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ నాటి జగన్ ప్రభుత్వం అత్యంత దారుణంగా చంద్రబాబును అరెస్ట్ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో […]

Nara Lokesh: గొడ్డలి పార్టీ సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ను ఎటువంటి ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేసింది. అత్యంత దారుణంగా అర్ధరాత్రి పూట రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. దాదాపు 53 రోజులపాటు ఆయనను నిర్బంధించింది.

అసలు ఎటువంటి అక్రమం జరగలేదని కోర్టులు చెబుతున్నప్పటికీ.. ప్రభుత్వం దగ్గర ఉన్న జీవోల ద్వారా స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ నాటి జగన్ ప్రభుత్వం అత్యంత దారుణంగా చంద్రబాబును అరెస్ట్ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టింది. ప్రమాదకరమైన వ్యక్తులు ఉండే బారక్ లో వేసింది. ఆయనకు రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పినప్పటికీ ప్రభుత్వం అత్యంత కక్షపూరితంగా వ్యవహరించింది.

నాడు చంద్రబాబును విడుదల చేయాలని సబ్బండ వర్గాలు రోడ్డుమీదికి వచ్చాయి. ఐటీ ఉద్యోగులు చంద్రబాబును విడుదల చేయాలని ఏకంగా భారీ ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో అతిపెద్ద సభ కూడా నిర్వహించారు. నాడు నారా లోకేష్.. పవన్ కళ్యాణ్.. బాలకృష్ణ వంటి వారు అనేక రకాలుగా సంప్రదింపులు జరిపారు. చివరికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి జరుగుతున్న విషయాన్ని వివరించారు. ఆ తర్వాత కోర్టులో చంద్రబాబు తరఫున న్యాయవాది వాదనలు వినిపించడం.. ఆయన బెయిల్ మీద విడుదల కావడం జరిగిపోయాయి. చివరికి జైలు నుంచి చంద్రబాబు విడుదలవుతున్నప్పుడు.. దారి పొడవునా లక్షలాదిమంది ఆయనకు స్వాగతం పలికారు. నిజం గెలిచింది అన్నట్టుగా కార్డులు పట్టుకొని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. నాటి నుంచి ఏపీ బాగు కోసం ఆయన కంకణం కట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. చివరికి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. నాడు చంద్రబాబును నిర్బంధించిన సెప్టెంబర్ 9వ తేదీని నారా లోకేష్ సోషల్ మీడియా వ్యక్తుగా గుర్తు చేశారు..”గొడ్డలి పార్టీ రాజకీయ కక్ష సాధింపుల కోసం మూడు సంవత్సరాలకు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులలో నిర్బంధించింది… దాదాపు 53 రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగుజాతి మొత్తం నిజం గెలవాలి అని చంద్రబాబుకు మద్దతుగా నిలిచింది. చివరికి నిజం గెలిచింది. చంద్రబాబు నిర్బంధం నుంచి విడుదలయ్యారు. నాడు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులను న్యాయస్థానాలు కొట్టి వేశాయి. నిజం గెలిచింది.. నాటి చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ.. తెలుగు జాతి మద్దతు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు అంటూ” లోకేష్ ట్వీట్ చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper