Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. చంద్రబాబు కీలక నిర్ణయం.. వైసిపి పిసుక్కోవాల్సిందే

Chandrababu Naidu: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. చంద్రబాబు కీలక నిర్ణయం.. వైసిపి పిసుక్కోవాల్సిందే

Chandrababu Naidu:అన్ని అవకాశాలను పరిశీలించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అన్ని దారులు వెతుక్కున్నారు. కోర్టు మెట్లు ఎక్కారు. హైకోర్టు చీకొట్టింది. సుప్రీం కోర్టు దాకా వెళ్లారు. అయినప్పటికీ ఉపయోగం లేదు. సుప్రీంకోర్టు కూడా గట్టిగా మొట్టికాయలు వేయడంతో ఏం చేయాలో తెలియలేదు. ఎలాంటి అడుగులు వేయాలో అర్థం కావడం లేదు. వరుస దెబ్బలు తిన్న వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజ్యాంగపరంగా 34% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం సాధ్యం కాకపోతే పార్టీ […]

Chandrababu Naidu:అన్ని అవకాశాలను పరిశీలించారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అన్ని దారులు వెతుక్కున్నారు. కోర్టు మెట్లు ఎక్కారు. హైకోర్టు చీకొట్టింది. సుప్రీం కోర్టు దాకా వెళ్లారు. అయినప్పటికీ ఉపయోగం లేదు. సుప్రీంకోర్టు కూడా గట్టిగా మొట్టికాయలు వేయడంతో ఏం చేయాలో తెలియలేదు. ఎలాంటి అడుగులు వేయాలో అర్థం కావడం లేదు. వరుస దెబ్బలు తిన్న వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.

రాజ్యాంగపరంగా 34% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం సాధ్యం కాకపోతే పార్టీ ద్వారా రిజర్వేషన్లు ఇస్తామని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటిని కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. బీసీలకు 34% రిజర్వేషన్ల విషయంలో తమ పార్టీ కట్టుబడి ఉందని చంద్రబాబు వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని భర్తీ చేసే విధంగా 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 105, జీవో 1065 తీసుకొచ్చారు చంద్రబాబు. ఆయనప్పటికీ వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు. వైసిపి హైకోర్టు వెళ్లడం వల్ల హైకోర్టులో కేసు కొట్టివేశారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. స్వయంగా బీసీమంత్రులు ఢిల్లీ వెళ్లారు.. న్యాయ నిపుణులతో చర్చించారు. ఇంత చేసినప్పటికీ సుప్రీంకోర్టు 34% రిజర్వేషన్లను అనుమతించలేదు. సుప్రీంకోర్టు అనుమతించకపోవడంతో బీసీల విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పార్టీ తరఫున అమలు చేస్తామని ప్రకటించారు. వెనుకబడిన తరగతుల వారి రాజకీయ గౌరవాన్ని.. ఆత్మగౌరవని కాపాడుతామని ప్రకటించారు.

చట్టపరంగా బీసీలకు న్యాయం చేసే అవకాశం తమ చేతిలో లేకపోయినప్పటికీ.. పార్టీ పరంగా బీసీలకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని.. 34 శాతం తగ్గకుండా సీట్లు బీసీ వర్గాలకు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. బీసీలకు న్యాయం చేసే దిశగా టిడిపి అడుగులు వేస్తోందని.. బీసీల హక్కులను అడ్డుకోవడమే వైసీపీ వైఖరి అని చంద్రబాబు ఆరోపించారు. వైసిపి కోర్టులకు వెళ్లి.. కుట్రలు చేసి.. మళ్లీ మా పైనే ఆరోపణలు చేస్తా ఉందని చంద్రబాబు ఆరోపించారు నాడు హైకోర్టు రిజర్వేషన్లు కొట్టేస్తే అధికారంలో ఉన్న వైసిపి కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని చంద్రబాబు ప్రస్తావించారు.

వాస్తవానికి బీసీలకు రాజ్యాధికారం అని తొలిసారి మాట్లాడింది టిడిపి అని.. అవకాశాలు కల్పించింది కూడా టిడిపి నేనని చంద్రబాబు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వల్ల నాలుగు దశాబ్దాల క్రితమే వెనుకబడిన తరగతుల గళం.. స్వరం వినిపించిందని.. తర్వాత కాలంలో దీనిని మరింత ముందుకు తీసుకెళ్లామని..1995 స్థానిక ఎన్నికల్లో వారి ప్రాతినిధ్యాన్ని 34 శాతానికి పెంచినట్టు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. టిడిపికి వెనుకబడిన వర్గాలు ఎప్పటికీ అండగా ఉన్నారని.. అందువల్లే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని అణగదొక్కే కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. వారి పాపాలు.. తప్పులు అంతటితోనే ఆగలేదని. బీసీలపై కక్షతో.. పగతో 30 ఏళ్ల నుంచి ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 24% తగ్గించారని.. దానివల్ల 16 వేల ఎనిమిది వందల మంది పదవులు కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper