Toxic Box Office Collection: ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా, ఎంత పెద్ద పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమా చేసినా, సరైన కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు రాకపోతే, వాళ్ళ నుండి ఎలాంటి దారుణమైన రియాక్షన్ వస్తుందో చెప్పడానికి రెండు రోజుల క్రితం విడుదలైన ‘టాక్సిక్’ చిత్రం ఒక బెస్ట్ ఉదాహరణ. యాష్ హీరో గా నటించిన ఈ సినిమాని 600 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో , హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ వంటివి చూసి, మనం చూస్తున్నది ఇండియన్ సినిమానా ?, లేదా హాలీవుడ్ సినిమానా ? అనే ఫీలింగ్ కలిగింది. జెన్ జీ ఆడియన్స్ అయితే మెంటలెక్కిపోయారు. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగానే, ప్రతీ షో హౌస్ ఫుల్ చేశారు. కానీ మొదటి ఆట నుండే ఈ చిత్రానికి దారుణమైన డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది.
థియేటర్స్ లోకి అడుగుపెట్టిన ఆడియన్స్, ‘మమ్మల్ని బయటకి పంపండి రా బాబోయ్’ అని అరిచి గోల చేసే రేంజ్ లో ఉందంటూ చూసిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. ఆ రేంజ్ డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ , మంచి హైప్ తో విడుదలైన సినిమా కావడంతో, ఈ చిత్రానికి మొదటి రోజు 135 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ రెండవ రోజు మాత్రం వసూళ్ళలో అత్యంత దారుణమైన డ్రాప్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే, రెండవ రోజు ప్రతీ థియేటర్ లోనూ డెఫిసిట్స్ వచ్చాయి. ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతం లో ఈ చిత్రానికి రెండవ రోజు వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా?, అక్షరాలా 4 లక్షల రూపాయిలు. మొదటి రోజు ఏకంగా కోటి రూపాయిల షేర్ వసూళ్లను ఈ ప్రాంతం నుండి రాబట్టింది ఈ చిత్రం.
కోటి రూపాయిలు ఎక్కడ?, 4 లక్షల రూపాయిలు ఎక్కడ?, ఈ రేంజ్ డ్రాప్స్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు చూడలేదని, భవిష్యత్తులో కూడా ఇలాంటి అద్భుతాన్ని చూడలేమని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. కేవలం ఉత్తరాంధ్ర లో మాత్రమే కాదు, దాదాపుగా ప్రతీ సెంటర్ లోనూ ఇదే పరిస్థితి. విజయవాడ వంటి ప్రాంతాల్లో అయితే, కమీషన్ లెక్కగడితే కానీ షేర్ వచ్చే పరిస్థితి లేదు. ఓవరాల్ గా రెండవ రోజు తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి కోటి రూపాయిల షేర్ వసూళ్లు కూడా నమోదు అవ్వలేదని అంటున్నారు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 40 కోట్ల కంటే తక్కువ ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.